అనధికార లేఅవుట్‌లో నిర్మాణాలకు అనుమతి లేదు
ABN , First Publish Date - 2022-09-16T05:22:27+05:30 IST
అనుమతి లేని లేఅవుట్‌లో నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని అధికారులు తేల్చి చెప్పారు.
మొగల్తూరు, సెప్టెంబరు 15: అనుమతి లేని లేఅవుట్‌లో నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని అధికారులు తేల్చి చెప్పారు. మొగల్తూరు పంచా యతీ పరిధిలో వేసిన అనధికార లేఅవుట్‌లో స్థలాలు కొనుగోలు చేసుకుంటే వారికి ఇంటి నిర్మాణానికి పంచాయతీ అనుమతి ఇచ్చేది లేదని గ్రామ కార్యదర్శి జయరాజు తెలిపారు. గురువారం మొగల్తూరు పంచాయతీ పరిధిలో ఇటీవల వేసిన పది అనధికార లే అవుట్‌ల్లో ఈవోఆర్డీ నవీన్ కిరణ్ ఆదేశాల మేరకు పంచాయతీ తరపున హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. నిర్మాణాలకు అనుమతి లేదని స్థలాల కొనుగోలుదారులకు ముందస్తు సమాచారం అందించారు. లేఅవుట్‌కు పంచాయతీ అనుమతి తీసుకోవాలని ఆయన కోరారు.