ఇంటికి వస్తామనుకోలేదు..

ABN , First Publish Date - 2022-03-05T05:41:06+05:30 IST

ఉక్రెయిన్‌ నుంచి ఇద్దరు విద్యార్థులు క్షేమంగా ఇల్లు చేరారు.దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చు కున్నా రు.

ఇంటికి వస్తామనుకోలేదు..
ఉండిలో జ్యోత్స్నప్రియకు గ్రామస్థుల ఆశీర్వాదం

కన్నీటిపర్యంతమైన ఉక్రెయిన్‌ విద్యార్థులు


 పాలకొల్లు టౌన్‌/ఉండి, మార్చి 4 : ఉక్రెయిన్‌ నుంచి ఇద్దరు విద్యార్థులు క్షేమంగా ఇల్లు చేరారు.దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చు కున్నా రు.యుద్ధం ఆరంభం నుంచి బిక్కుబిక్కుమంటూ గడిపి.. బంకర్లలో తలదాచుకుని.. భయపడుతూ బతి కిన క్షణాలను తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు. శుక్రవారం పాలకొల్లుకు చెందిన సత్య, ఉండికి చెందిన జ్యోత్స్న ప్రియ ఇళ్లకు చేరారు.ఉక్రె యిన్‌ యుద్ధంపై వారు ఏమన్నారంటే..


చాలా భయం వేసింది : జ్యోత్స్న


నా కుటుంబ సభ్యులను ఇలా చూస్తాననుకోలేదు. చాలా భయం వేసింది. రోజురోజుకి పరిస్థితులు భిన్నం గా మారాయి.అప్పటి వరకు తాము ఉన్న యూని వర్శిటీకి ఎటువంటి ప్రమాదంలేదు. రెండు రోజుల్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. యూనివర్సటి వద్ద బాంబాలు పడ్డాయి. బంకర్లలో దాక్కున్నాం. అక్క డి నుంచి బయటపడ్డాం అంటే రొమేనియాలో చిక్కు కుపోయాం. ఏం జరుగుతుందో తెలియదు.. ఎలా ఇం టికి చేరుకుంటామో తెలియదు.ఇంటి వచ్చినం దుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఉండికి చెందిన ఇజ్జిని జ్యోత్స్న వంశీప్రియ.ఈ సంఘటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు ప్రశంసనీయమన్నారు. అనంత రం గ్రామస్థులంతా  జ్యోత్స్నను ఆశీర్వదించారు.


రొట్టెలు తిని ఐదు రోజులు గడిపా : సత్య


ఉక్రెయిన్‌ నుంచి బయటప డతామో లేదో అని పించింది. చాలా భయం వేసిం ది.కీవ్‌ యూనివర్శిటీలో మెడిసిన్‌ 2వ సంవత్సరం చదువుతున్నా. ఉక్రె యిన్‌ రష్యాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలియగానే స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. అనేక ఇబ్బందులు పడుతూ బంకర్‌లో రొట్టెలు మాత్రం తింటూ ఐదు రోజులు గడిపా.మా యూనివర్శిటీ లో ఉన్న 3 వేల మంది భారతీయ విద్యార్థులను హెడ్‌ హరిదీప్‌, దివ్య సురక్షితంగా తరలించేందుకు బస్‌ ఏర్పాటు చేసి బోర్డర్‌లోని చోప్‌ పట్టణానికి తరలించారు.చోప్‌ నుంచి హంగేరీ బోర్డర్‌కు కేవలం ఒక కిలోమీటరు దూరమే ఉన్నప్పటికీ దాటడానికి మాకు 24 గంటలు పట్టింది. అక్కడి నుంచి భారత ఎంబసీ అధికారులు బుధవారం ఫ్లైట్‌ ఎక్కించి ఢిల్లీకి పంపించారు.గురువారం ఢిల్లీలో దిగగానే ఆంధ్రా భవన్‌ అధి కారులు మాకు అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తరలించారు.అక్కడి నుంచి శుక్రవారం సాయంత్రానికి క్షేమంగా ఇల్లు చేరానంటూ చెప్పుకొచ్చాడు పాలకొల్లు పట్టణానికి చెందిన కె.సత్య..


అంజేరిలో భీమవరం విద్యార్థి


 భీమవరం క్రైం : భీమవ రం అక్షయ డయాగ్నోస్టిక్స్‌ అధి నేత బలే మారిష్‌ కుమారుడు అక్షయ్‌ (21) ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఉక్రెయిన్‌ దేశం నుంచి ప్రస్తుతం ప్రక్క దేశం అంజేరిలో ఉన్నా నంటూ తండ్రికి ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. స్వదేశానికి రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. తన కుమారుడిని స్వదేశానికి రప్పించాలని తండ్రి వేడుకొంటున్నాడు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన విద్యార్థులు కాగిత వెంకట హేమంత్‌ గణేష్‌, అద్దంకి యివాంజలిన్‌లు ప్రస్తుతం హైదరాబాద్‌ చేరుకున్నట్టు సమాచారం.

Read more