రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

ABN , First Publish Date - 2022-11-25T00:22:23+05:30 IST

కొర్లకుంట పంచాయతీ శివారు తాళ్ళవల్లి ప్రధాన రహదారిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

ముసునూరు, నవంబరు 24 : కొర్లకుంట పంచాయతీ శివారు తాళ్ళవల్లి ప్రధాన రహదారిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. చింతలవల్లి ఎస్సీకాలనీకి చెందిన పిల్లి రాజేష్‌కుమార్‌ (38) నూజివీడు మండలం తుక్కులూరులోని ప్రియా ఫుడ్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తున్న సమయంలో తాళ్ళవల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభానికి ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలవడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని ముసునూరు ఎస్‌ఐ ఎం.కుటుంబరావు, వీఆర్వో పద్మ పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఏడాది వయసు గల కుమారుడు ఉన్నారు.

వరికోత మిషన్‌పైనే డ్రైవర్‌ మృతి

చాట్రాయి, నవంబరు 23: మండలంలోని పోలవరం గ్రామంలో తమిళవాడుకు చెందిన వరికోత మిషన్‌ డ్రైవర్‌ జస్టిన్‌రాజ్‌ (40) గురువారం మృతి చెందాడు. ఆగి ఉన్న వరికోత మిషన్‌పై అతను చనిపోయి ఉండటంతో సమాచారం మేరకు చాట్రాయి ఏఎస్‌ఐ గజపతిరావు సిబ్బందితో వెళ్ళి విచారణ జరిపారు. మృతుడు తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా నరసింగపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తమిళనాడు చెందిన మరికొంత మంది డ్రైవర్లు, గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-11-25T00:22:23+05:30 IST

Read more