సమరయోధుడు కాకానికి ఘన నివాళి
ABN , First Publish Date - 2022-08-04T06:12:14+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుల జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ఆచరించాలని ఎంపీడీవో పి.వెంకటరత్నం అన్నారు.
కైకలూరు, ఆగస్టు 3: స్వాతంత్య్ర సమరయోధుల జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ఆచరించాలని ఎంపీడీవో పి.వెంకటరత్నం అన్నారు. బుధవారం కైకలూరు 1వ సచివాలయం వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడు కాకాని వెంకటరత్నం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ డీఎం నవరత్నకుమారి, ఈవోపీఆర్డీ ఆర్.రవి శంకరరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముదినేపల్లి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బుధవారం స్వాతంత్య్ర సమరయోధుడు, కృష్ణా జిల్లా ప్రముఖుడు కాకాని వెంకటరత్నం జయంతి వేడుకలు ముదినేపల్లి మండలంలో ఘనంగా జరిగాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కాకాని చిత్రపటానికి ఎంపీడీవో పి.మల్లేశ్వ రి మండల పరిషత్ ఏవో రమణబాబు, పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాస్, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముదినే పల్లి పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ నిమ్మగడ్డ కైకమ్మ తదితరులు నివాళులర్పించారు.
కలిదిండి: గుర్వాయిపాలెంలో స్వాతంత్య్ర సమరయోధుడు కాకాని వెంకటరత్నం జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో సీతారామకుమార్ వెంకటరత్నం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ బత్తిన ఉమామహేశ్వరరావు, ఎంపీటీసీ గోదారి సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. అలాగే పెదలంక, చినతాడినాడ, కలిదిండిలో కాకాని వెంకటరత్నం జయంతి వేడుకలను నిర్వహించి జాతీయ జెండాను ఊరేగించారు.
మండవల్లి: మహనీయుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వాతం త్య్రమని మండవల్లి సర్పంచ్ మెండా ఝాన్సీ అన్నారు. బుధవారం మండ వల్లి సచివాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు కాకాని వెంకట రత్నం చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. లోకుమూడి జడ్పీ హైస్కూల్లో హెచ్‌ఎం డి.ఉషారాణి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాన్ని బీజేపీ మత్య్సశాఖ సెల్ జిల్లా కన్వీనర్ లావేటి వీరశివాజీ ముఖ్య అతిధిగా పాల్గొని వివరించారు. పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.