పశువులకు సంచార వైద్య సేవలు
ABN , First Publish Date - 2022-07-21T05:50:14+05:30 IST
జిల్లాలోని పశు పోషకులు వారి పశువులకు ఎటువంటి రోగాలు వచ్చినా సంచార సేవలు వినియోగించుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె.మురళీకృష్ణ సూచించారు.
భీమవరం టౌన్, జూలై 20: జిల్లాలోని పశు పోషకులు వారి పశువులకు ఎటువంటి రోగాలు వచ్చినా సంచార సేవలు వినియోగించుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె.మురళీకృష్ణ సూచించారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1962 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేస్తే వాహనం వస్తుందన్నారు. జిల్లాలో 7 డివిజ న్లలో ఉండగా 7 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక వైద్యాధికారి, కాంపౌండర్, అటెండర్ కమ్ డ్రైవర్ ఉంటారని ఆయన వివరించారు.