నేడు వైకుంఠ ఏకాదశి

ABN , First Publish Date - 2022-01-13T05:50:26+05:30 IST

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో గల వైష్ణవ దేవాలయాల్లో స్వామి, అమ్మవార్లను ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు వైకుంఠ ఏకాదశి
ఏలూరు జనార్దనస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం

 వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార  దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 12 : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో గల వైష్ణవ దేవాలయాల్లో స్వామి, అమ్మవార్లను ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచే స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేశారు. అగ్రహారంలో జనార్దనస్వామి, పవరుపేట శ్రీదేవి, భూదేవి సమేత వాసుదేవస్వామి, పడమరవీధి వేంకటేశ్వరస్వామి, రామచంద్రరావుపేట వేంకటేశ్వర స్వామి, అశోక్‌నగర్‌ శ్రీవారి ఆలయం వద్ద ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయా ఆలయాల నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-01-13T05:50:26+05:30 IST