సైకిల్ జోష్
ABN , First Publish Date - 2022-10-28T00:00:59+05:30 IST
మూడున్నరేళ్ళ ఒడిదుడుకులు, అక్రమ కేసుల బనాయింపు, కక్ష సాధింపులు, విర్రవీగిన అధికార పార్టీని బలంగా ఎదుర్కొని ఉమ్మడి పశ్చిమలో అత్యధిక నియోజకవర్గాల్లో టీడీపీ మరింత పట్టు సాధించే దిశగా వేగంగా దూసుకెళుతోంది.
ఉమ్మడి పశ్చిమలో మారుతున్న పొలిటికల్ సీన్
కీలక నియోజకవర్గాల్లో టీడీపీ దండయాత్ర
క్రమంగా బలహీన పడుతున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు
ఆ స్థానాల్లో పాగాకు టీడీపీ వ్యూహం
ఏలూరులో బడేటి చంటి వైసీపీపై విలక్షణ నిరసన
మిగతాచోట్ల బాదుడే బాదుడు సక్సెస్
పార్టీ శ్రేణుల్లో పెరిగిన స్థైర్యం
మూడున్నరేళ్ళ ఒడిదుడుకులు, అక్రమ కేసుల బనాయింపు, కక్ష సాధింపులు, విర్రవీగిన అధికార పార్టీని బలంగా ఎదుర్కొని ఉమ్మడి పశ్చిమలో అత్యధిక నియోజకవర్గాల్లో టీడీపీ మరింత పట్టు సాధించే దిశగా వేగంగా దూసుకెళుతోంది. కీలక నియోజకవర్గాల్లో అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజామోదానికి దాదాపు దూరమై, ప్రతికూల స్థితిలోకి చేరారు. ఆయా స్థానాల్లో పాగా వేసేందుకు వీలుగా ఇప్పటికే టీడీపీ వ్యూహరచన చేస్తోంది. తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన సీనియర్లు పార్టీలో చిన్నచిన్న విభేదాలు, కాస్తంత వర్గపోరును ఇప్పుడే దారికి తెచ్చారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఉమ్మడి పశ్చిమ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. నియో జకవర్గాల్లో బలమైన కేడర్, నాయకత్వం పార్టీ సొంతం. చిన్నచిన్న విభేదాలున్నా వాటిని ఎన్నికల ఫలితాలపై ప్రభావితం కానివ్వకుండా జాగ్రత్త పడేవారు. గత ఎన్నిక ల్లో ఇక్కడ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. చివరి నిమిషం లో జరిగిన కొన్ని మార్పులు, చేర్పులే ఇందుకు కారణం. దీనికితోడు మితిమీరిన విశ్వాసం, లోపించిన ఆర్థిక బలం మరో కారణం. గడిచిన మూడున్నరేళ్ళుగా అధికార వైసీపీ ఎత్తుగడలను, ఒత్తిళ్ళను, వేధింపులను ఎదుర్కొంటూనే టీడీపీ 12 నియోజకవర్గాల్లో కుదుటపడింది. ప్రజాభిమా నాన్ని కూడగట్టుకునేందుకు విరామం లేకుండా శ్రమిస్తు న్నారు. ఏలూరు జిల్లా కేంద్రంలో టీడీపీ కన్వీనర్ బడేటి చంటి ప్రజా చైతన్యయాత్ర పేరిట 45 రోజులపాటు కాళ్ళ కు జోళ్ళు ధరించకుండా నల్ల వస్త్రాలు కలిగి ఏలూరు డివిజన్‌లో యాత్ర చేశారు. వైసీపీ దుశ్చర్యలపై నిరస న తెలిపారు. టీడీపీ గెలుపు ఆవశ్యకతను గుర్తు చేశారు. దీంతో ఇక్కడ టీడీపీ శ్రేణులన్నీ ఒక్కట య్యాయి. వైసీపీని ఎదుర్కోవడానికి సిద్ధపడు తున్నాయి. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ దూసుకెళ్తున్నారు. వైసీపీ కేడర్ టీడీపీ కేడర్ ను అవమానించేలా, వేధించేలా చర్యలకు దిగి తే పులిలా ఎదురు తిరుగుతున్నారు. ఉం గుటూరు నియోజకవర్గంలో పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నిల దొక్కుకునే ప్రయత్నాలు వ్యూహాత్మకంగా సాగి స్తున్నారు. ఆరు నెలలుగా ఆయన నియోజక వర్గంలో చేస్తున్న సుడిగాలి పర్యటన చేస్తూ కేడర్ ను ఉత్తేజపరుస్తున్నాయి. పోలవరం నియోజకవర్గం లో బాధితుల పక్షాన తక్షణం రంగంలోకి దిగడం, వారికి కావాల్సిన సాయం అందజేయడం, కేడర్‌ను కలుపుకు పోవడంలో అక్కడి కన్వీనర్ బొరగం శ్రీనివాస్ ముందం జలో ఉన్నారు. వైసీపీకి దూకుడుకు దాదాపు బ్రేక్ వేసేలా ముందుకు సాగుతున్నారు. పాలకొల్లు, ఉండి నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు రామానాయుడు, మంతెన రామరాజు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ నియోజక వర్గాల్లో వైసీపీ ఆగడాలను వీరిద్దరూ ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే హోదాలో వీరిద్దరూ ఉన్నా పరోక్షంగా వైసీపీ కన్వీనర్లే పెత్తనం చేసేందుకు తరచూ ప్రయత్నించడం, వీరిద్దరినీ అవమానపరిచేలా యంత్రాంగాన్ని ప్రోత్స హిస్తున్నా వీటికి అదరకుండా, బెదరకుండా దీటుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కేడర్ సైతం ఇదే క్రమంలో ముందుకు సాగుతోంది. తణుకు లో ఆరిమిల్లి రాధాకృష్ణ తన గెలు పును పదిలం చేసుకునేందుకు కష్టపడుతున్నారు. దీనికి అంతర్గ త మద్ధతు ఉంది. ఒకప్పుడు మాదిరిగానే తణుకు లో సైకిల్ దూసుకెళ్ళేలా రాజకీయ ఎత్తుగడతోనే సాగుతున్నారు. విలక్షణ రాజకీయాలున్న తాడేపల్లిగూడెంలోనూ పార్టీ కన్వీనర్ వలవల బాబ్జీ అందరినీ కలుపుకుపోవడం ద్వారా ఇప్పటికే పైచేయిలో ఉన్నారు. అక్కడ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యవహార శైలిని ఎండగట్టడంలో ధైర్యంగా అడుగు వేయడమే కాకుండా మిగతా టీడీపీ కేడర్‌కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న పార్టీ పరిస్థితి బేరీజు వేస్తే ఈ మధ్యన భారీగా పుంజుకున్నట్టు విశ్లేషిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ తనదైన శైలిలో నియోజకవర్గానికి అంటిపెట్టుకుని ఉండటమే కాకుండా వైసీపీ ఎత్తు గడలను ఎక్కడికక్కడ తిప్పి కొడుతూ తన కేడర్ మరింత బలపడేలా చేయడం, పార్టీ కార్యక్రమాలన్నింటి లోనూ చురుగ్గా వ్యవహరిస్తుండటం తో ఇప్పుడు ఆచంటలో పార్టీ కేడర్ యావత్తు ఉత్సాహంతో ఉంది. భీమ వరం నియోజకవర్గంలో రాజకీయా లను చక్కదిద్దేందుకు పార్టీ అధినేత చంద్రబాబు త్వరలోనే అందరితో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. తేదీ ఖరారు కావాల్సి ఉంది. ఇక్కడ పార్టీ కార్యక్రమాలను జిల్లా అధ్యక్షు రాలు తోట సీతారామలక్ష్మి పర్యవేక్షిస్తూ పాల్గొంటున్నారు. కీలక అంశాలపై సీనియర్లతో ముఖాముఖి భేటీ కావడం, తక్షణం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం పార్టీ కేడర్‌కు సంతృప్తినిస్తోంది. నరసాపురంలో ఒకిం త గందరగోళం చెలరేగినా ఇప్పుడిప్పుడే సద్దుమణిగిం ది. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రామరాజు ఉత్సా హంగా ముందుకు కదులుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పార్టీని అంటి పెట్టుకునే ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా వైసీపీ అన్ని నియోజకవర్గాల్లోనూ బేజారెత్తుతోంది. చింతలపూడి నియోజ కవర్గంలో కన్వీనర్‌గా ఎవరిని నియమి స్తారనే దానిపై ఇప్పటికీ తర్జనభర్జనలే ఉన్నాయి. ఇప్పటికే ప్రచారంలో ఉన్న మద్దాల రాజేష్‌ను పార్టీలోకి తీసుకోవడం గాని, కన్వీనర్‌గా ఎంపిక చేయడం గాని చాలా మందికి రుచించడం లేదు. ఇదే విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. ఇక్కడి నుంచి తిరిగి పోటీకి మాజీ మంత్రి పీతల సుజాత సిద్ధపడుతుండగా, ఇదే స్థానం నుంచి పోటీకి దిగాలని పలువురు భావిస్తు న్నారు. జడ్పీ మాజీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు ప్రతీ రోజూ ఓ ఊరు చొప్పున ఎంపిక చేసుకుని నియోజకవర్గ యాత్ర చేస్తున్నారు.
ఆ ఐదింట్లో ఓకే
పార్టీ అధినేత చంద్రబాబు నెల రోజులుగా వివిధ నియోజకవర్గాల కన్వీనర్లతో వరుస భేటీలు సాగిస్తున్నా రు. ఇప్పటి వరకు ఏలూరు, ఉండి, తణుకు, దెందులూరు, పోలవరం భేటీలు పూర్తయ్యాయి. మరో అర డజను నియోజక వర్గాల కన్వీనర్లతో వచ్చే నెలలో భేటీ కానున్నా రు. ఇప్పటికే పూర్త యిన నియోజకవర్గ భేటీల్లో వారి పని తీరు ఎలా ఉందో తన దగ్గర ఉన్న నివే దికలతో చంద్రబాబు సరిపోల్చుకున్నారు. ఎలా వ్యవహరించాలో తేల్చి చెప్పే శారు. కొందరికి సంతృప్తికర సంకే తాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణరాజు సైతం జిల్లాలో చురుగ్గానే వ్యవహరించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రలో విరామం లేకుండా అంగర ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
ఈ మూడింట..
గోపాలపురం, కొవ్వూ రు, నిడదవోలు నియోజక వర్గాల్లో అసలేం జరుగుతోంది. దీనిపై పార్టీ కేడర్ తర్జభర్జన పడుతోంది. గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్‌గా మద్దిపాటి వెంకట్రాజు అధిష్టానం ఎంపిక చేసింది. పార్టీకి సుదీర్ఘంగా అంతర్గత సేవ చేస్తున్న మద్దిపాటిని వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి గా నిలబెట్టాలనే నిర్ణయం దాదాపు ఖరారైనట్టే. దీనిపై మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ రెండు వర్గాలను సర్దుబాటు చేయడానికి పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. నిడదవోలులో కొన్నాళ్ళపాటు సైలెంట్‌గా ఉన్న బూరుగుపల్లి శేషారావు ఈ మధ్యనే కాస్త వేగాన్ని పెంచారు. తానే నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తానన్నట్టు ఆయన అడుగులు వేస్తున్నారు. కొవ్వూరులో జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జవహర్‌ను కొవ్వూరు నుంచే పోటీకి దింపుతారా, లేకుంటే మరేదైనా నిర్ణయం ఉంటుందా అనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ సాగుతూనే ఉంది. జవహర్ మాత్రం వీటినేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.