Fish lorry: చేపల లారీ బోల్తా..ఎగబడ్డ స్థానికులు

ABN , First Publish Date - 2022-11-25T08:36:31+05:30 IST

ఫ్రీగా వచ్చిన దాన్ని జనాలు వదులుతారా..కొనుక్కుని తిన్న దానికంటే ఫ్రీగా వచ్చిన దాన్ని

Fish lorry: చేపల లారీ బోల్తా..ఎగబడ్డ స్థానికులు

Eluru District: ఫ్రీగా వచ్చిన దాన్ని జనాలు వదులుతారా..కొనుక్కుని తిన్న దానికంటే ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మనవాళ్లు ముందుంటారని చెప్పాలి. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. చేపల లోడ్‎తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. అయ్యో అనాల్సింది పోయి..అసలు పట్టించుకోలేదు అక్కడి జనాలు. అసలు లారీలో ఉన్న మనుషులకు ఏమైనా అయ్యిందా అని కూడా కనికరం చూపించలేదు. మాకు తెలియదనంటూ చేపల కోసం సంచులు పట్టుకుని వచ్చి ఎంచక్కా ఎత్తుకుని వెళ్లారు. మరి..లారీ డ్రైవర్, క్లీనర్ బ్రతికి ఉన్నారా.. అని కూడా చూడకుండా ఇలా చేపల కోసం ఎగబడ్డారు.

ఈ ఘటన ఏలూరు జిల్లా జీలుగుమిల్లీ మండలం దర్భగూడెంలో జరిగింది. చేపల లోడ్‎తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‎కు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. లారీ కిందపడ్డంతో చేపలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. చేపల లోడుతో లారీ కర్ణాటక నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-11-25T09:17:51+05:30 IST