రేపటి నుంచి టెట్‌

ABN , First Publish Date - 2022-08-05T05:10:45+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌) ఈ నెల ఆరు నుంచి 21వ తేదీ వరకు నిర్వహిం చనున్నారు.

రేపటి నుంచి టెట్‌

ఏలూరు జిల్లాలో మూడు కేంద్రాలు

21వ తేదీ వరకు రెండు పూట్లా నిర్వహణ

ఆన్‌లైన్‌ ఆధారిత పరీక్షకు 5,933 మంది 

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 4 : ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌) ఈ నెల ఆరు నుంచి 21వ తేదీ వరకు నిర్వహిం చనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత(ఆన్‌లైన్‌) పరీక్షగా నిర్వహించే ఈ పరీక్షను ఏలూరు జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. పెదవేగి మండలం దుగ్గిరాల ఏలూరు కాలేజి ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (755 మంది అభ్యర్దులు), వట్లూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల (1,657 మంది), వట్లూరు ఇంద్రప్రస్థ గ్రీన్స్‌ ప్రాంగణంలోని శ్రీ విద్యాలయ జూనియర్‌ కళాశాలల్లో (3,521 మంది) పరీక్ష కేంద్రాలను టెట్‌కు ఎంపిక చేసినట్టు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, డీఈవో ఆర్‌.ఎస్‌. గంగా భవాని తెలిపారు. పరీక్షలు రోజుకు రెండు సెషన్స్‌లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయని వివరించారు. ఈ మూడు పరీక్ష కేంద్రా లకు మొత్తం 5,933 మంది అభ్యర్థులను కేటాయించామన్నారు. హాల్‌ టికెట్‌, ప్రభుత్వ గుర్తింపు ఐడీతో అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. 


Updated Date - 2022-08-05T05:10:45+05:30 IST