సర్దుబాటు తడబాటు

ABN , First Publish Date - 2022-12-07T00:49:36+05:30 IST

బోధ నేతర విధులు, పలు యాప్‌లు, సకా లంలో జీతాలు ఇవ్వకుండా ఇప్పటికే టీచ ర్లను ప్రభుత్వం వేధిస్తోందంటూ క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు తీవ్రమవుతున్న వేళ విద్యాశాఖ చేపట్టిన వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ (పని సర్దుబాటు) తీరు ఉపాధ్యాయులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

సర్దుబాటు తడబాటు

టీచర్లకు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ వేదింపులు

ఒత్తిళ్లు తేవద్దంటున్న విద్యాధికారులు

వీటికంటే బదిలీలే బెటరంటున్న ఉపాధ్యాయులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 6 : బోధ నేతర విధులు, పలు యాప్‌లు, సకా లంలో జీతాలు ఇవ్వకుండా ఇప్పటికే టీచ ర్లను ప్రభుత్వం వేధిస్తోందంటూ క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు తీవ్రమవుతున్న వేళ విద్యాశాఖ చేపట్టిన వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ (పని సర్దుబాటు) తీరు ఉపాధ్యాయులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. నెలలకాలంగా బదిలీల గురించి ఎదురు చూస్తోన్న వేళ వాటిని పక్కనబెట్టి వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేపట్టి, అశాస్త్రీయంగా టీచర్లను సుదూర ప్రాంతాలకు బలవంతంగా పంపించడంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తొలుత జిల్లాల పునర్విభజన ప్రాతిపదికన నిర్వహించిన పని సర్దుబాటును, మంగళవారం జిల్లాలకు పంపిన సమాచారం ప్రకారం పాత ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకుని వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ను చేపట్టాలని సూచించడంతో అంతా గందరగోళంగా తయారైంది. ఇంతకుముందు చేపట్టిన వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ ప్రకారం ఏలూరు జిల్లాలో అన్నికేడర్లలో మొత్తం 312 మంది ఉపాధ్యాయులను సర్‌ప్లస్‌ (మిగులు)గా గుర్తించి, కొరత వున్న పాఠశాలలకు సర్దుబాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వీరిలో 188 మంది ఎస్జీటీలు ఉన్నారు. వీరిలో పలువురు ఇప్పటికే తమకు కేటాయించిన స్థానాల్లో డిప్యూటేషన్లపై విధుల్లో చేరిపోగా, ఇపుడు వెలువడిన నిర్ణయం మేరకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సర్దుబాటు చేస్తే వీరిస్థానాలు మళ్లీ మారిపోయే అవకాశాలున్నట్టు చెబుతున్నారు, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేసినట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతుండగా, సర్వీస్‌ రూల్స్‌ నియమాలకు విరుద్దంగా టీచర్లను అడ్డగోలుగా సుదూర ప్రాంతాలకు, యాజ మాన్యాలను మార్చి సైతం చేసేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకుండానే కొత్తగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను ప్రామాణికంగా తీసుకుని సర్‌ప్లస్‌ టీచర్లను గుర్తించి నూతన విద్యావిదానం నిబంధనల మేరకు ఏర్పాటైన పాఠశాలలకు ఈ నెల 8వ తేదీలోగా సర్దుబాటు చేయాలని సూచనలు వెలు వడ్డాయి. ఈ మొత్తం ప్రక్రియను పూర్తిచేసేకంటే బదిలీలు నిర్వ హించడమే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు జిల్లాలో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ అశాస్త్రీయంగా నిర్వహిం చారంటూ సోమవారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో డీఈవో కార్యా లయం వద్ద మెరుపు ముట్టడి, ధర్నాలను నిర్వహించగా, అదే కోవలో ఇపుడు ఎస్టీయూ ఉపాధా్యాయ సంఘం కూడా ఆందోళనను చేపట్టనుంది.

పదోన్నతులు తీసుకున్నవారికి స్థానాలు కేటాయిస్తే పరిష్కారమైనట్టే

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ

రెండు నెలలక్రితం టీచర్లకు పదోన్నతులు ఇచ్చేందుకు అంగీకార పత్రాలను విద్యాశాఖ తీసుకుంది. వారికి ఇంతవరకు బదిలీ స్థానాలను కేటాయించలేదు. ఇపుడు వారందరికీ స్థానాలను కేటాయిస్తే వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ అవసరమే ఉండదు. అలాగే రేషనలైజేషన్‌ జీవో 117కు సవరణ చేసి అమలు చేసినట్టయితే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్య తలెత్తదు. వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన చేయాలని నిర్ణయించడం ఆహ్వానించతగినదే.

బాధ్యతల నుంచి తప్పుకుంటా..

‘టీచర్ల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ జీవోలు ఇచ్చేది మీ ప్రభుత్వమే. వాటిని అమలు చేస్తుంటే ఫలానా వారిని అక్కడే ఉంచండి. కదపొద్దు..అని చెప్పేదీ మీరే. ఇలాగైతే ఎలా ముందుకు సాగేది ?’ అంటూ జిల్లాకు చెందిన ఓ విద్యాధికారి తన ఆవేదన వెళ్లగక్కారు. అందరికీ వర్క్‌ అడ్జస్ట్‌ మెంట్‌ వద్దంటే ఎలా ? ఇటువంటి చిన్న విషయాలకు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక పదవుల్లో వున్న అధికార పార్టీ నేతల నుంచి రికమండేషన్‌ లేఖలు తేవడం, మాపై ఒత్తిడి తేవడం ఎందుకు ? అసలు వర్క్‌ అడ్జస్ట్‌ మెంటే ఆపేస్తే పోలా? వీటిని ఆమోదించి ఉన్న తాధికారుల నుంచి చీవాట్లు, అక్షింతలు వేయించు కునేకంటే జిల్లా నుంచి వెళ్ళిపోవడం మంచిదేమోననిపిస్తోంది..అంటూ తన బాధ వెళ్లగక్కారు.

Updated Date - 2022-12-07T00:49:38+05:30 IST