నెక్ట్స్‌ ఏంటి ?

ABN , First Publish Date - 2022-12-07T00:52:41+05:30 IST

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమలోనే తెలుగుదేశం అధినేత శ్రీకారం చుట్టారు.

నెక్ట్స్‌ ఏంటి ?
ఇటీవల చింతలపూడిలో మాట్లాడుతున్న చంద్రబాబు

ఆ.. నియోజకవర్గాలపై టీడీపీ కసరత్తు

మూడు రోజుల పర్యటనలో ‘అసలు’ బోధపడింది

గెలుపు గుర్రాలే ఇక కాబోయే ఇన్‌చార్జ్‌లు

సంక్రాంతికి ముందా.. తరువాతా అనేది సస్పెన్స్‌

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమలోనే తెలుగుదేశం అధినేత శ్రీకారం చుట్టారు. మూడు రోజులు ఏకదాటిగా 300 కిలోమీటర్ల మేర రాత్రి పొద్దుపోయేంత వరకు ఆరు నియోజకవర్గాలను చుట్టుముట్టారు. కీలక నియోజకవర్గాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మూడు రోజుల యాత్రలో గమనించిన అంశాలు, బలా బలాలు, ఉమ్మడి తనం, గ్రూపిజం వంటివెన్నో బయటపడ్డాయి. నియోజకవర్గ సారధి నియామకం, ఆవశ్యకత, అధినేతకు తెలియజేశాయి. చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు వంటి నియోజకవర్గాల్లో తక్షణం ఏకసారఽథ్యంలో పార్టీ ఎన్నికల దిశగా అడుగులు వేసేలా బాధ్యతలు నేతలందరికీ పంచేలా త్వరలోనే చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసు కోబోతున్నారా..? ఇంతక ముందు అయితే అందరినీ మెప్పించే విధంగా తుది నిర్ణయం ప్రకటనకు కాలయాపన చేసేవారు. ఇప్పుడు దీనికి భిన్నంగా నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ల ప్రకటన చేయబోతున్నారా..? ఆ దిశగానే పార్టీ నాయకత్వం మరో వైపు రాబిన్‌శర్మ బృందం అంచనాలను పరిగణలోకి తీసుకోబోతున్నారా ?ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే తెలుగుదేశం నియోజకవర్గ నేతల చుట్టు తిరుగుతున్నాయి. కొవ్వూరు తెలుగుదేశంలో నెలకొన్న పరిస్ధితులను అధిష్ఠానం కాస్తంత సీరియస్‌గానే తీసుకుంది. మొన్న బహిరంగ సభకు జనం ఆశించినంత సంఖ్యలో హాజరు కాలేదు. ఇక్కడ వర్గాల వారీగా నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేయడం, ఉమ్మడితనం దెబ్బతినడం వంటి పరిణామాలను గమనించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జవహర్‌ వర్గం ఒక వైపు, మిగతా వారంతా ఇంకో వర్గంగా వ్యవహరించారు. త్వరలోనే ఇక్కడి గ్రూపు రాజకీయాలకు చెక్‌ పెట్టేలా నిర్ణయం కుంటారని భావిస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితిని గమనించారు. సభ సక్సెస్‌ అయినప్పటకీ అక్కడ ఎవరికి వారు విడివిడిగా పర్యటన విజయానికి పోటీలు పడ్డట్టు గమనించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పోటీలో ఉన్న మరో ఇద్దరు కూడా నిడదవోలు పర్యటన సక్సెస్‌లో భాగస్వాములయ్యారు. మొన్న పర్యటనలోనే గోపాలపురం ఇన్‌చార్జిని ప్రకటించారు. అలాగే నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో నెలకొన్న సస్పెన్స్‌కు త్వరలోనే అధినేత ముగుంపు ఇవ్వనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Updated Date - 2022-12-07T00:52:42+05:30 IST