రాష్ట్రంలో అరాచక పాలన

ABN , First Publish Date - 2022-12-09T23:55:08+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన
కాగుపాడులో స్థానికుల సమస్యలను తెలుసుకుంటున్న గన్ని

టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు

గ్రామాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాలు

ఉంగుటూరు, డిసెంబరు 9 : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. శుక్రవారం కాగుపాడులో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం మాజీ సర్పంచి కడియాల రవిశంకర్‌ స్వగ్రహంలో జరి గింది. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసు కున్నా రు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నల్లా ఆనంద్‌, ఎస్సీ సెల్‌ మండల కన్వీన్‌ నేకూరి ఆశీర్వాదం, ఇమ్మణ్ని గంగాధరావు, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.

ఏలూరుటూటౌన్‌ : సీఎం జగన్‌ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని టీడీపీ నాయకుడు ఈడ్పుగంటి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కోర్టులో అడ్వకేట్ల సమక్షంలో రాష్ర్టానికి ఇదేం ఖర్మ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. టీడీపీ నాయకుడు చల్లా ప్రసాద్‌ మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణయ్య ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు వైసీపీ పాలనలో జరిగే అన్యాయన్ని వివరిస్తున్నామన్నారు. ఎ.నారాయ ణరావు, వెంకటేశ్వరరావు, బెల్లంకొండ కిషోర్‌, పాల్గొన్నారు.

కొయ్యలగూడెం : కొయ్యలగూడెంలో పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి అనే కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, రోజురోజుకి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తెలుగు మహిళా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు జ్యేష్ట రామకృష్ణ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ రవీంధ్రనాధ్‌, రాచూరి మధన్‌, ఆకుల అరుణ్‌, తదితరులు పాల్గొన్నారు.

కామవరపుకోట : టీడీపీ ఆధ్వర్యంలో ఆడమిల్లిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రా నికి అనే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, నాయకులు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, టీడీపీ నాయకులు సిరిగిబత్తుల నాగరాజు, జంపాల ఆంజనేయులు, తూంపాటి పెంటయ్య, ఉయ్యూరు, ఉదయ్‌కిరణ్‌, చింతలపూడి నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు జిజ్జూరు బాబ్జి, ఆడమిల్లి సర్పంచ్‌ గూడపాటి కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

బుట్టాయగూడెం : బూసరాజుపల్లిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమాన్ని నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ శుక్రవారం నిర్వహిం చారు. భవన నిర్మాణ కార్మికుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను ప్రాధాన్యం ప్రకారం పరిష్కరిస్తామన్నారు. సున్నం నాగేశ్వరరావు, మడకం రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:55:09+05:30 IST