‘సమస్యల పరిష్కారంలో వైసీపీ విఫలం’

ABN , First Publish Date - 2022-12-07T00:40:22+05:30 IST

ప్రజా సమస్యలు పరిష్కరించ డంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనే యులు అన్నారు

‘సమస్యల పరిష్కారంలో వైసీపీ విఫలం’
భీమడోలులో మాట్లాడుతున్న గన్ని వీరాంజనేయులు

భీమడోలు/ఏలూరు టౌన్‌, డిసెంబరు 6 : ప్రజా సమస్యలు పరిష్కరించ డంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనే యులు అన్నారు భీమడోలులో మంగళవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ ఆయన ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పార్టీ నిర్ధేశించిన నమూనా ప్రకారం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు పెద్దిరాజు, పుల్లయ్యనాయుడు, మురళీకృష్ణ, శేషగిరి, పైడిమాల యుగంధర్‌ పాల్గొన్నారు. ఏలూరు మూడో డివిజ్‌లో టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతీ ఇంటికెళ్లి సమస్యలు నమోదు చేయాలి : బొరగం

కొయ్యలగూడెం/పోలవరం : ప్రతీ ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు నమోదు చేయాలని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ కోరారు. మంగళవారం కొయ్యలగూడెంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీడీపీ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల మద్దతు పలకడానికి ఓ నంబరును పెట్టామని దానికి మిస్డ్‌కాల్‌ ఇస్తే వారికి కావల్సిన సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ రామారావు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ రవీంద్ర, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి గంగిరెడ్ల మేఘలా దేవి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ తదితరలు పాల్గొన్నారు. పోలవరంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగిన టీడీపీ మండల సమావేంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి నియోజకవర్గంలో నిర్వహించే ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు కుంచే దొరబాబు, పాదం ప్రసాద్‌, డోకుల నాగేశ్వరరావు, యడ్ల వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

బీసీ సెల్‌ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ’

దెందులూరు, డిసెంబరు 6 : ప్రచారం తప్ప అభివృద్ధికి చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి ఉండడం నిజంగా ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి అని బీసీలు అనుకుంటున్నారని టీడీపీ బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు తలకొండ జమలయ్య విమర్శించారు. మంగళవారం దెందులూరులో బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు నున్న లక్ష్మణరావు ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి యిప్పిలి వెంకటేశ్వరావు, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షడు పెనుబోయిన మహేష్‌యాదవ్‌, బీసీ సెల్‌ కార్యదర్శి మారగాని సత్యనారాయణ, కొటకల కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:40:44+05:30 IST