మంచి రోజులు రావాలంటే జగన్ రెడ్డి పోవాలి: బొరగం శ్రీనివాసులు

ABN , First Publish Date - 2022-08-29T01:54:54+05:30 IST

మంచి రోజులు రావాలంటే సీఎం జగన్‌రెడ్డి పోవాలని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పేర్కొన్నారు.

మంచి రోజులు రావాలంటే జగన్ రెడ్డి పోవాలి: బొరగం శ్రీనివాసులు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): మంచి రోజులు రావాలంటే సీఎం జగన్‌రెడ్డి పోవాలని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పేర్కొన్నారు. బుట్టాయగూడెం మండలం, రాజానగరం పంచాయతి లక్ష్మిపురం, రెడ్డిగూడెం గ్రామాల్లో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో శ్రీనివాసులు పాల్గొన్నారు. లక్ష్మిపురం, రెడ్డిగూడెం గ్రామాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు, కరెంట్ ఆర్టీసీ చార్జీలు పెంపుపై కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, అప్పులు తప్ప అభివృద్ది లేదని తప్పుబట్టారు. అసమర్థ ముఖ్యమంత్రిని గద్దె దించాలని, సమర్థుడు అయిన చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీని గెలిపించాలని శ్రీనివాసులు కోరారు. 


ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం కన్నపరాజు,  తుర్రం శ్రీను, కుంజా గంగులు, వెట్ల రెడ్డి, మడకం ప్రేమ్ కుమార్, సాయం సురేష్, కురసం వెంకటేష్, కుంజా వెంకన్నబాబు, కుంజం ప్రసాద్, రేలంగి నాగు, రేలంగి పండు, వేట్ల పెంటమ్మ, వేట్ల దుర్గమ్మ, కోపాలు సూరమ్మ, కోపాలు లీలావతి, కోపాలు లక్ష్మి గార్లు,  కుసినే వెంకటలక్ష్మి, కుసినే గంగా, కుంజా రామరాజు, గురివింద మనోజ్ కుమార్, జమ్ముల సాయికుమార్, కుసినే చంద్రశేఖర్, గురివింద రాజేష్, వడిసెల నాగరాజు, కుసినే సాయికుమార్, గురివింద మహేష్, జమ్ముల సోమరాజు, తేనె కుమార్, తేనే సురేష్, గురివింద కన్నయ్య, గురివింద వెంకటేశ్వరరావు, గురివింద రాజ్ కుమార్, గురివింద హేమంత్ కుమార్, కుసినే జానకి రామ్, వనం నాగేంద్రబాబు, గురివింద పొశిరావు తదితరులు పాల్గొన్నారు.

Read more