పసుపు పండుగ

ABN , First Publish Date - 2022-05-27T05:56:07+05:30 IST

1983 నుంచి 2019 వరకు దాదాపు తొమ్మిదిసార్లు జరి గిన సార్వత్రిక ఎన్నికల్లో ఐదుసార్లు తెలుగుదేశంకు ఓట్ల పట్టాభిషేకం జరిగింది.

పసుపు పండుగ

నేడు ఒంగోలులో టీడీపీ మహానాడు

జిల్లా నుంచి భారీగా వెళుతున్న తెలుగు తమ్ముళ్లు

 నాలుగు దశాబ్దాల చరిత్ర.. ఎన్నో విజయాలు.. మరెన్నో ఆటంకాలు

ఉమ్మడి పశ్చిమ అనేకమార్లు క్లీన్‌ స్వీప్‌.. కొన్నిసార్లు వెనుకంజ

ఎందరో సీనియర్ల శాశ్వత నిష్క్రమణ.. ప్రజాక్షేత్రంలో దూసుకెళుతున్న కొత్తతరం

అధికార పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకత.. బాధితుల పక్షాన దేశం


నాలుగు దశాబ్దాల్లో గోదావరి ఒడ్డున సైకిల్‌ సుదీర్ఘ జైత్రయాత్ర సాగించింది. వైద్యులు, ఉపాధ్యాయులు, కింది స్థాయి కార్యకర్తలు  ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పీఠమెక్కారు. మంత్రులుగా ఎదిగారు. జిల్లాను శాసించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా తిరుగులేని విజయాలు సాధించింది. మరెన్నో చేదు అనుభవాలు చవిచూసింది. ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా, చంద్రబాబు ఆదర్శంగా ఒంగోలు మహానాడుకు సంసిద్ధమైంది. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

1983 నుంచి 2019 వరకు దాదాపు తొమ్మిదిసార్లు జరి గిన సార్వత్రిక ఎన్నికల్లో  ఐదుసార్లు తెలుగుదేశంకు ఓట్ల పట్టాభిషేకం జరిగింది. పార్టీ ఆవిర్భావం తరువాత 1983 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమలో 16 అసెంబ్లీ సీట్లకు గాను 15 చోట్ల జెండాను ఎగురవేశారు. చింతలపూడి నుంచి కోటగిరి విద్యాధరరావు ఒక్కరే ఇండి పెండెంట్‌గా గెలిచారు. 1985లో నాదెండ్ల భాస్కరరావు పార్టీలో చిచ్చు పెట్టినప్పుడు జరిగిన ఎన్నికల్లో 16 స్థానా లనూ సైకిలే స్వీప్‌ చేసింది. 1989లో కాంగ్రెస్‌ గెలిచినా తొమ్మిది స్థానాలతో ఇక్కడ పార్టీ ఆధిక్యత కొనసాగింది. 1994లో 14 సీట్లు టీడీపీ గెలుచుకోగా, కేవలం రెండుస్థానా లే కాంగ్రెస్‌కు దక్కాయి. 1999లోను 12 స్థానాలను నిల బెట్టుకోగా, ఒక్క రాజశేఖరరెడ్డి హయాంలో 2004, 2009 ఎన్నికల్లో నాలుగేసి సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పట్లో సామాజిక వర్గాల సమతుల్యతలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ జిల్లాలోని 15 నియోజకవర్గ స్థానాలను గెలిపించారు. 2019 ఎన్నికల్లో మాత్రం పార్టీ ఒడిదుడుకులకు లోనైంది. కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో పార్టీ రాజకీయంగా అనేక రాజకీయ ప్రస్తావనలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు రాజకీయ పొత్తుల్లో భాగంగా అప్పట్లో ఆచంట నియోజకవర్గాన్ని సీపీఎంకు కేటాయించారు. 1994లో పెనుగొండ స్థానాన్ని సీపీఐకు, 2014లో తాడే పల్లిగూడెం స్థానాన్ని బిజెపికి ఎన్నికల పొత్తులో భాగంగా కేటాయించారు.


తిరుగులేని విజయాలు.. చేదు అనుభవాలు

తెలుగుదేశం తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో అనేక విజయాలనే కాదు.. ఒడిదుడుకులను ఎదుర్కొంది. గడిచిన 40 ఏళ్లల్లో ఎందరికో రాజకీయ ఆశ్రయం కల్పించింది. కోటగిరి విద్యాధరరావు, పీవీఎల్‌ నరసింహరాజు, దండు శివరామరాజు, అబ్బాయిరాజు వంటి యోధానుయోధులు పార్టీకి సారధ్యం వహించి, తిరుగులేని ఆధిపత్యం ప్రద ర్శించారు. కొత్తపల్లి సుబ్బారాయుడు, కృష్ణబాబు, గారపాటి సాంబశివరావు, పెండ్యాల వెంకట కృష్ణారావు వంటి వారెం దరో తమ నియోజకవర్గ రాజకీయాలను శాసించారు. గోపాలపురం, కొవ్వూరు, పోలవరం నియోజకవర్గాల్లో కృష్ణబాబు చెప్పిందే వేదం. డెల్టా నియోజకవర్గాల్లో సుబ్బా రాయుడు రాసిందే శాసనం. మెట్టలో కోటగిరి రాజకీయ చెలాయింపు. ఇలా పేరొందిన నేతలంతా జిల్లాలో పార్టీని ముందుకు తీసుకువెళ్ళారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయక త్వం కింద తిరుగులేని ఆధిక్యతను నిలుపుకుంటూ వచ్చా రు. విజయం సాధించినా.. ఓటమి పొందినా అంతే ధీమా తో ఉండేవారు. ఆ తర్వాత రాజకీయాల్లో కాస్తంత వేగం పెరిగిన తర్వాత.. కాంగ్రెస్‌ పక్షాన వైఎస్‌ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఉమ్మడి పశ్చిమలో పార్టీ పట్టు కాస్త తగ్గింది. అయినప్పటికీ ఎక్కడా వెన్ను చూపించ కుండా సీనియర్లంతా ఒక్కటై ముందుకు సాగారు. యర్రా నారాయణస్వామి వంటి సీనియర్‌ నేతలు పార్టీకి ఒక సమయంలో దిక్కయ్యారు. 2014 ఎన్నికల్లో అనేక మంది పార్టీని వీడిపోయారు. ఇంకొందరు శాశ్వతంగా నిష్క్రమిం చారు. అయినా నిమ్మల రామానాయుడు, పితాని సత్యనా రాయణ, సీతారామలక్ష్మి, చింతమనేని ప్రభాకర్‌, ఆరిమిల్లి రాధాకృష్ణ, శివరామరాజు, మాగంటి బాబు, ముళ్ళపూడి బాపిరాజు, పీతల సుజాత, జవహర్‌, గన్ని వీరాంజనేయు లు, మాధవనాయుడు, బూరుగుపల్లి శేషారావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, అంజిబాబు, మంతెన రామరాజు, జయ మంగళ వెంకటరమణ, బడేటి చంటి వంటి వారెందరో పార్టీకి అండదండగా నిలిచారు. వీరి జైత్రయాత్ర ముందు వైసీపీ నిలవలేకపోయింది. 2019లో మాత్రం కాస్తంత పార్టీకి నష్టదాయక ఫలితాలు ఎదురయ్యాయి. 


పడిలేచిన కెరటం

ఆ తర్వాత కాలంలో పార్టీలో నేతల మధ్య సమతుల్యత  తగ్గి వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన రాజకీ య శక్తులను ఓడించడానికి బదులు తమ పార్టీనే బలహీ నపరిచే విధంగా కొందరు వ్యవహరించారు. ఈ మధ్యన ఎదురైన ఆటంకాలన్నీ ఇన్నీ కావు. అధికార పార్టీ నుంచి ఎదురుదాడులు.. మరెన్నో తప్పుడు కేసులు. కాని, ఇప్పుడు పార్టీ మళ్లీ పుంజుకుంది. పడి లేచిన కెరటంలా.. ఉమ్మడి పశ్చిమలో అనేక స్థానాల్లో బలంగా నిలబడుతోంది. పార్టీ కేడర్‌, నేతలు ఏకతాటిపైకి వచ్చారు. పార్టీ నాయకత్వం పిలుపు ఇచ్చిందే తడవుగా వీధుల్లోకి వచ్చేవారెందరో. మహిళలు, యువకుల్లో ఉత్సాహం రగిలింది. ఇదే దశలో పార్టీ అత్యంత కీలకంగా భావించే 35వ మహానాడు సంద ర్భంగా పసుపు పండుగ చేసుకునేందుకు సంసిద్దులవుతు న్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతమై ప్రజా సమస్యలపై గళమెత్తుతోంది. సాధారణ జనం తమ్ముళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మహానాడు సందర్భంగా అధికార పార్టీ ఎన్ని ఆంక్షలు పెట్టినా వెరవకుండా ఒంగో లు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదా వరి జిల్లాలుగా రెండుగా విడిపోయినా పార్టీ బలపడేందు కు తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయుల సారధ్యంలో ఉరకలేస్తుంది. ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్‌, మంతెన సత్యనారాయణరాజు వంటి వారు రంగంలో ఉన్నారు. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా నియోజకవర్గాల్లో కన్వీనర్లు కేడర్‌కు అండదండగా నిలుస్తున్నారు.అందరినీ సమన్వయపరుస్తున్నారు.


Updated Date - 2022-05-27T05:56:07+05:30 IST