నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలు నిలిపివేత

ABN , First Publish Date - 2022-12-13T00:05:29+05:30 IST

దశాబ్దాల నుంచి పింఛన్లు, ప్రభుత్వ రాయితీ లు పొందుతున్న లబ్ధిదారులకు నిబంధనల పేరుతో వాటిని నిలిపివేశారని టీడీపీ మండల అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి రత్నరాజు, బీసీ విభాగం ఉపాధ్య క్షుడు పాలవలస తులసీరావు, గుబ్బల శ్రీరామ్‌ తదితరులు మండిపడ్దారు.

నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలు నిలిపివేత
వేల్పూరులో సమస్యలు తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి

పోడూరు, డిసెంబరు 12: దశాబ్దాల నుంచి పింఛన్లు, ప్రభుత్వ రాయితీ లు పొందుతున్న లబ్ధిదారులకు నిబంధనల పేరుతో వాటిని నిలిపివేశారని టీడీపీ మండల అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి రత్నరాజు, బీసీ విభాగం ఉపాధ్య క్షుడు పాలవలస తులసీరావు, గుబ్బల శ్రీరామ్‌ తదితరులు మండిపడ్దారు. జిన్నూరులో సోమవారం జరిగిన ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ర్టాభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శిం చారు. నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను, ఇబ్బందులను నమోదు చేసుకున్నారు. టీడీపీ కమిటీ అధ్యక్షుడు భూపతిరాజు సత్యనారా యణరాజు, కుక్కల సత్యనారాయణ, చెల్లబోయిన వెంకట్రావు, వల్లూరి ధనుంజయ, కలిదిండి రవిరాజు, శంఖు సుబ్రహ్మణ్యం, జడ్డు సూరి, గిరిగి గోపాలకృష్ణ, యలకల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తణుకు: వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. వేల్పూరులో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిచి రైతులు పూర్తిగా నష్టపోయారని, పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయించలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రతి మహిళ ఈ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు పితాని మోహన్‌, వేల్పూరు అధ్యక్షుడు రెడ్డి కేశవ, క్లస్టర్‌ ఇంఛార్జ్‌ బొడపాటి తాతరాజు, కాసాని శ్రీను, ప్రేమానందం, వల్లూరి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

మొగల్తూరు: నిలకడలేని నిర్ణయాలతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్‌, పొత్తూరి రామరాజు ఆరోపించారు. కేపీ పాలెం సౌత్‌ పంచాయతీలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో వారు మాట్లాడారు. టీడీపీ మండల అధ్యక్షు డు గుబ్బల నాగరాజు, సత్తినేని సర్వేశ్వరరావు, వాతాడి ఉమామహేశ్వర రావు, అందే రామకృష్ణ, పాలా రాంబాబు, లోకం శ్రీను, కడలి మోహనరావు, డొల్లా రత్నంరాజు, బొక్కా ఏడుకొండలు, సత్తినేని త్రిమూర్తులు, బాబ్జి, కొల్లాటి బోగరాజు, బాలకృష్ణ, డిఎస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:05:32+05:30 IST