అమరావతిపై హైకోర్టు తీర్పు హర్షణీయం

ABN , First Publish Date - 2022-03-05T05:42:12+05:30 IST

రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు అన్నారు.

అమరావతిపై హైకోర్టు తీర్పు హర్షణీయం
ఆచంటలో ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న నాయకులు

ఆచంట,పెనుగొండ, మార్చి 4 : రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు అన్నారు.ఆచంట, పెనుగొండ మండల కేంద్రాల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు.రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. ఆచంట మండలంలో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి టీడీ పీ నాయకులు పాలభిషేకం చేశారు.పెనుగొండలో ఎన్‌టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు టీడీపీ నాయకులు నక్కా వేద వ్యాస శాస్త్రి, కటికిరెడ్డి నానాజీ, వేండ్ర రాము పూలమాలలు వేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ చిలుకూరి శ్రీను,బాలం వెంకట రమణ, నెక్కంటి రామకృష్ణ, తాళ్ళూరి శ్రీను, తమ్మినీడి శివ, రాపాక ఆనందరావు, కుసుమే వెంకట్రావు,మండా ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:42:12+05:30 IST