గుడివాడ ఎమ్మెల్యే నాని బరితెగింపు..

ABN , First Publish Date - 2022-09-12T05:11:09+05:30 IST

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్థాయి మరిచి నీచమైన సంస్కృతితో బరితెగించి వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

గుడివాడ ఎమ్మెల్యే నాని బరితెగింపు..
భీమవరంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న నేతలు

కొడాలి వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ శ్రేణులు

చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు


భీమవరం క్రైం, సెప్టెంబరు 11: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్థాయి మరిచి నీచమైన సంస్కృతితో బరితెగించి వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఎన్టీయార్‌ కుటుంబంపై అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై టీడీపీ నాయకులు భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ శవ రాజకీయాలపై పుట్టిన వైసీపీలో బూతుల ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. మెరగా ని నారాయణమ్మ మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలతో రాష్ట్రంలోని ప్రతీ మహి ళా సిగ్గు పడుతున్నారని విమర్శించారు. పట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌, ఎద్దు ఏసుపాదం, మాదాసు కనకదుర్గ, మైలాబత్తుల ఐజాక్‌బాబు, చెల్లబోయిన సుబ్బారావు, సయ్యద్‌ నసీమా బేగం, తదితరులు పాల్గొన్నారు.


తణుకు: ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలు అసహ్యం కలిగిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే నాని ఆరిమిల్లి ఆధ్వర్యంలో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దొమ్మేటి వెం కట సుధాకర్‌, బసవా రామకృష్ణ, తోట సూర్యనారాయణ, కెఎల్‌ఎన్‌ ప్రసాద్‌, నండూరి రామానుజమ్‌, ఊట రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


పాలకోడేరు: ప్రజాప్రతినిధి అని మర్చిపోయి చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్‌కోటేశ్వరరాజు డి ూండ్‌ చేశారు. కొడాలి అనుచిత వాఖ్యలను నిరసిస్తూ పాలకోడేరులో టీడీపీ నాయకులు ర్యాలీ, పోలీస్‌స్టేషన్‌ వద్ద దర్నా నిర్వహించారు అనంతరం పాలకోడేరు పోలీసులకు నాని వాఖ్యలపై ఫిర్యాదు చేశారు. కోటిరాజు, దొంగ కృష్ణ, జీ. సత్యనారాయణ, మాధవ, మల్లేశ్వరరావు, ఖాజా వీరాస్వామి, జయలక్ష్మి, మదుసూదనరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


ఆకివీడు: బూతుల ఎమ్మెల్యే కొడాలి నానిని బర్తరఫ్‌ చేయాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. నాని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. నాని చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్‌, బొల్లా వెంకట్రావు మాట్లాడుతూ మంత్రి పదవి కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడన్నారు. నౌకట్ల రామారావు, గంధం ఉమా, గొంట్లా గణపతి, భూపతిరాజు తిమ్మరాజు, అజ్మల్‌, ఆరీఫ్‌, అల్లు సాంబ, గోరీబాబా, మీసాల రవి, అడపా అబ్బు లు, జాకీర్‌,  కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, బత్తుల శ్యామల, మోపిదేవి సత్యవతి, మోటుపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


కాళ్ళ: చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని అవ మానకరమైన ప్రకటనలు, నీచమైన దుర్భాష తమ మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఎమ్మెల్యే నానిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు జీవీ.నాగేశ్వరరావు, తోట ఫణిబాబు, పన్నాసి వెంకటేశ్వరరావు, బండారు వేణుగోపాలరావు, కందులపాటి వీరరాఘవులు, గులిపల్లి జోగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-12T05:11:09+05:30 IST