వైసీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు
ABN , First Publish Date - 2022-12-16T23:27:56+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి అన్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్, డిసెంబరు 16: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి అన్నారు. పట్టణంలోని నాలుగోవార్డులో శుక్ర వారం ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వా నికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రజలకు సక్రమంగా మంచినీరు అందించలేకపోతున్నారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి సొంత ఆస్తులను పెంచుకునే పనిలో ఉన్నారే తప్ప పట్టణ ప్రజల బాగోగులపై దృష్టి పెట్డడం లేదన్నారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు, పన్నులు పెంచేయడం ఒక ఎత్తయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోందన్నారు. కార్యక్రమంలో పట్టణ అఽధ్యక్షుడు పట్నాల రాంపండు, సబ్నివీసు కృష్ణమోహన్, జిల్లా కార్యదర్శి వాడపల్లి సుబ్బరాజు, దొడ్డ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లు : మండలంలోని దగ్గులూరులో శుక్రవారం టీడీపీ నాయ కులు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. శాగా సత్యనా రాయణ, మండల కార్యదర్శి పాముల రజనీకుమార్ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కె.రామచంద్రరాజు ఆధ్వర్యంలో వైసీపీ పాలనపై ప్రజల అభిప్రా యాలు సేకరించారు. ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. మహి ళలు తమ సమస్యలు నాయకులకు వినిపించారు. కార్యక్రమంలో అందే కోటి వీరభద్రరావు, కొమ్మాని కన్నారావు, కూర్మా సాంబయ్య, నాయ కులు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.