Maganti babu: రాజధానిపై సుప్రీంకు వెళ్లడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్

ABN , First Publish Date - 2022-09-29T16:42:57+05:30 IST

అమరావతే రాజధానిగా ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా... ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందని టీడీపీ నేత మాగంటి బాబు అన్నారు.

Maganti babu: రాజధానిపై సుప్రీంకు వెళ్లడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్

ఏలూరు: అమరావతే రాజధానిగా ఉండాలని హైకోర్టు(AP High court) తీర్పు ఇచ్చినా... ప్రభుత్వం (AP government) సుప్రీంకోర్టు (Supreme court)కు వెళ్ళడం వెనుక జగన్ (CM Jagan)మాస్టర్ ప్లాన్ ఉందని టీడీపీ నేత మాగంటి బాబు (Maganti babu) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...  ఆరు నెలల క్రితం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్(NTR) పేరు పెట్టినప్పుడే అనుమానించానని తెలిపారు. దానిలో భాగంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలలకు సుప్రీంకోర్టుకు వెళ్ళారన్నారు. పాదయాత్ర చేస్తున్న వారిపై మంత్రుల వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. ‘‘నేను కూడా మంత్రిగా చేసాను.. మంత్రిగా ఎలా వ్యవహరించాలో వారు తెలుసుకోవాలి’’ అని మాగంటి బాబు (TDP Leader) హితవుపలికారు. 

Updated Date - 2022-09-29T16:42:57+05:30 IST