‘దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలి’
ABN , First Publish Date - 2022-08-05T05:12:45+05:30 IST
వైసీపీ నాయకుడు దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని, టీడీపీ శ్రేణులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తుంగలోకి తొక్కు తామని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు.
కైకలూరు, ఆగస్టు 4 : వైసీపీ నాయకుడు దేవేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని, టీడీపీ శ్రేణులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తుంగలోకి తొక్కు తామని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మృతిపై వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలపై గురువారం కైకలూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమామహేశ్వరి మృతిని ఆసరాగా తీసు కుని వైసీపీ నాయకులు హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని విమ ర్శించారు. హైదరాబాద్ భూవివాదంలో లోకేశ్ వేధింపుల వల్లే ఆమె చని పోయిందని అభియోగాలు మోపి మానసికంగా టీడీపీని కుంగదీయాలని చూస్తే సహించమన్నారు. టీడీపీ నాయకులు బలే ఏసురాజు, పాముల జోసఫ్ తంబి, దావు నాగరాజు, పళ్ళెం ఏడుకొండలు, బొంగు రవికుమార్, జయమంగళ సుబ్బరాజు, ఆసానీ ఖాన్, బోయిన నాగు, మీగడ శివకృష్ణ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన..
ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి పరీక్షలు నిర్వహించి మూడురోజుల్లో అందిం చాల్సిన కళ్లజోళ్లను నెలరోజులకు కూడా అందించడం లేదని మాజీ ఎమ్మెల్యే జయమంగళ విమర్శించారు. గురువారం కైకలూరు ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి మాట్లాడారు. కరోనా సమయంలో శానిటైజర్లు వినియోగించడం లేదని, ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పేదలకు కళ్లజోళ్లు సకాలంలో అందజేయాలని డిమాండ్ చేశారు.
ఉమామహేశ్వరి మృతిపై తప్పుడు ప్రచారం తగదు
ముదినేపల్లి
రూరల్, ఆగస్టు 4 : దివంగత ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి మృతికి
సంబంధించి వైసీపీ నాయకులు మానవత్వం లేకుండా దిగజారుడు రాజకీయాలు చేయడం
బాధాకరమని తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు దావు నాగరాజు, పశుగణాభివృద్ధి
సంస్థ చైౖర్మన్ కొత్తా నాగేం ద్రకుమార్ అన్నారు. ఆమె మృతిపై వైసీపీ
నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. గుర్రం
దేవేందర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం నెలనెలా వేతనం పొందుతున్నాడని, దీనికి
ప్రతిఫలంగా ప్రతిపక్ష నాయకులపై తప్పుడు ప్రచారం చేయడం పరిపాటిగా
మారిందన్నారు.