Chintamaneni prabhakar: పాదయాత్రకు వెళ్తున్నట్లు మీకు చెప్పానా...పోలీసులతో చింతమనేని వాగ్వాదం

ABN , First Publish Date - 2022-09-24T16:46:52+05:30 IST

జిల్లా సమీపంలోని దుగ్గిరాలలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాల మోహరించారు.

Chintamaneni prabhakar: పాదయాత్రకు వెళ్తున్నట్లు మీకు చెప్పానా...పోలీసులతో చింతమనేని వాగ్వాదం

ఏలూరు: జిల్లా సమీపంలోని దుగ్గిరాలలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌(Chintamaneni prabhakar) ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాల మోహరించారు. అమరావతి రైతుల పాదయాత్ర (Amaravati farmers padayatra)కు వెళ్లకూడదని ప్రభాకర్‌ (TDP Leader)పై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభాకర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా... అందుకు చింతమనేని నిరాకరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘‘రైతుల పాదయాత్రకు నేను వెళుతున్నాను అని మీకు చెప్పానా.. ఏది పడితే అది రాసిస్తే, నేను నోటీసు ఎలా తీసుకుంటాను.నోటీసు ఇచ్చే అధికారం మీకు లేదు’’ అంటూ పోలీసులతో చింతమనేని ప్రభాకర్ వాగ్వాదానికి దిగారు. 


Read more