నవరత్నాల పేరుతో మోసం : బడేటి చంటి

ABN , First Publish Date - 2022-08-18T05:05:08+05:30 IST

నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి జగన్‌ రాష్ర్టాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు.

నవరత్నాల పేరుతో మోసం : బడేటి చంటి
42వ డివిజన్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్న చంటి

ఏలూరుటూటౌన్‌, ఆగస్టు 17: నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి జగన్‌ రాష్ర్టాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. బుధవారం 42వ డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలు అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదన్నారు.  అర్హులైనవారు దర ఖాస్తు చేసుకోవాలంటే సాధికారిక సర్వేను నిలుపుదల చేశారన్నారు. కాంట్రా క్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలోనే పనులు నిలిపివేసి పారిపో యారన్నారు. జగన్‌ మూడేళ్ల పాలనలో రాష్ర్టాన్ని 40 ఏళ్ళు వెనక్కి నెట్టారన్నారు. రాష్ర్టాన్ని పూర్వస్థితికి తేవాలంటే టీడీపీని గెలిపించి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. డివిజన్‌ ఇన్‌చార్జి రాజేష్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జి మల్లెపు రాము, పాలి ప్రసాద్‌, ఆర్నేపల్లి మధుసూదనరావు, శివశంకర్‌, శెట్టి సరిత, గుమ్మడి సూర్యనారాయణ, కర్రి రమేష్‌ పాల్గొన్నారు. 

Read more