టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి : ఎమ్మెల్సీ అంగర

ABN , First Publish Date - 2022-06-07T06:36:25+05:30 IST

టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి : ఎమ్మెల్సీ అంగర

టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి : ఎమ్మెల్సీ అంగర

పాలకొల్లు అర్బన్‌, జూన్‌ 6: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, వైసీపీని చిత్తుగా ఓడించడానికి తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. ఎల్‌ఆర్‌పేటలోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్లు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందని, తాను ఎంత తగ్గాలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుని పవన్‌ నిర్ణ యించుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ అధ్యక్షుడిగా కాకుండా జగన్‌ కోవర్టుగా సోము వీర్రాజు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనలో నష్టపోయిన దానికన్నా జగన్‌ పాలనలో రాష్ట్రం మరింత నష్టపోయిందన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిస్తే వైసీపీకి 10, 15 సీట్లు కూడా రావన్నారు. వైసీపీ నాయకులు ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ప్రజా ప్రతినిధిని, కాకినాడలో ఓ ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్‌ను, రెండు రోజుల క్రితం పల్నాడులో టీడీపీ నాయకుడిని హత్య చేశారని, హత్యారాజకీయాలపై ప్రజలు విసుగు చెందారని అంగర అన్నారు.


Read more