-
-
Home » Andhra Pradesh » West Godavari » tdp free food for poor people-MRGS-AndhraPradesh
-
చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్న క్యాంటీన్లు
ABN , First Publish Date - 2022-09-14T04:56:33+05:30 IST
చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాగా నే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి అన్నారు.

భీమవరం అర్బన్, సెప్టెంబరు 13: చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాగా నే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి అన్నారు. పార్థసారథి జన్మది నం సందర్భంగా పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేదలకు అన్నదాన కా ర్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి పార్థసారథికి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, రేవు వెంకన్న, కౌరు పృథ్వీరాజు, ఎద్దుఏసుపాదం, మాదాసు కనకదుర్గ, తిరుపాల్ పాల్గొన్నారు.
రాష్ట్రమంతా అన్న క్యాంటీన్లు ప్రారంభించాలి
తాడేపల్లిగూడెం అర్బన్: పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల ను రాష్ట్రమంతా ప్రారంభించాలని టీడీ పీ నేత వలవల బాబ్జి అన్నారు. తాడేపల్లిగూడెం శేషమహల్ సెంటర్ వద్ద మంగళవారం అన్నసమారాధన నిర్వ హించారు. బాబ్జీ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల మూత సరికాదన్నారు. పట్నా ల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, మద్దిపాటి ధర్మేంద్ర, పాతూరి రాంప్రసాద్‌చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
