‘కోత’లపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2022-04-10T06:02:42+05:30 IST

విద్యుత్‌ సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టివేసిందని టీడీపీ మండల అధ్యక్షుడు నారగాని వీర వెంకట నాగేశ్వరరావు అన్నారు.

‘కోత’లపై టీడీపీ నిరసన
కానుకొల్లులో కొవ్వొత్తులతో టీడీపీ నాయకుల నిరసన

మండవల్లి, ఏప్రిల్‌ 9: విద్యుత్‌ సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టివేసిందని టీడీపీ  మండల అధ్యక్షుడు నారగాని వీర వెంకట నాగేశ్వరరావు అన్నారు. మండవల్లి మండలం కానుకొల్లులో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కరెంటు కోతలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.  గ్రామాల్లో విద్యుత్‌ను ఇష్టానుసారం తీసేయ్యడంతో ఆక్వా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస చక్రవర్తి, పార్టీ  శ్రేణులు పాల్గొన్నాయి.

Read more