ఎన్టీఆర్ కుటుంబంపై అసత్య ప్రచారం తగదు
ABN , First Publish Date - 2022-08-05T05:27:03+05:30 IST
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో నాయకులు వివిధ పోలీస్టేషన్లలో గురువారం ఫిర్యాదులు చేశారు.
ఎన్టీఆర్ కుమార్తె మరణంపై వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు
కామవరపుకోట/భీమడోలు/గణపవరం/పోలవరం ఆగస్టు 4 : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో నాయకులు వివిధ పోలీస్టేషన్లలో గురువారం ఫిర్యాదులు చేశారు.
కామవరపుకోట మండలం తడికలపూడి పోలీసులకు తెలుగు యువత నాయకులు ఫిర్యాదు చేశారు. అసత్య ప్రచారం చేస్తున్న నింది తులను కనుగొని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థి ంచారు. నత్తా నాగేంద్రబాబు, నూతి లక్ష్మీనారాయణ, డోలా విజయ్, సిరగిబత్తుల నాగరాజు, పామర్తి శేఖర్, బలుసు సాయి, దేవరపల్లి గంగరాజు ఉన్నారు. ఉంగుటూరు మండల టీడీపీ నాయకులు చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుయువత కన్వీనర్ రెడ్డి సూర్యచంద్రరావు,ఎస్సీ సెల్ కన్వీనర్ యాళ్ళ సుజీవరావు, ఇమ్మణ్ణి గంగాధరరావు, సప్పా వీరబాబు, తదితరులు పాల్గొన్నారు. భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలతో ప్రజలను అయోమయంలో పడేసి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని నాయకులు అన్నారు. వెంటనే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నిలిపి వేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. పుల్లయ్యనాయుడు, గన్ని నాగ గోపాల రావు, కరణం పెద్దిరాజు, శేషగిరి, ఎడ్లపల్లి రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండల టీడీపీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరణించిన వారి పట్ల అనుచితంగా ప్రచారం చేయడం హేయమైన చర్య అన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ యువత అధ్యక్షుడు అద్దేపల్లి వాసురాజు, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యాళ్ళ సుబ్బారావు తదితరులు అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠంనేని మహేశ్వరి అనుచిత వ్యాఖ్యలు చేయడం రాక్షస సంస్కృతి అని టీడీపీ సీనియర్ ఏఎంసీ వైస్ చైర్మన్ కుంచే దొరబాబు అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహ జ్వాలల్లో మాడి మసై పోతారన్నారు.