వైసీపీ పాలనలో రహదారులు అధ్వానం

ABN , First Publish Date - 2022-09-25T07:19:23+05:30 IST

వైసీపీ పాలనలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు.

వైసీపీ పాలనలో రహదారులు అధ్వానం
తాడేపల్లిగూడెంలో అధ్వానంగా వున్న రహదారి వద్ద టీడీపీ నాయకులు

తాడేపల్లిగూడెం అర్బన్‌/ తాడేపల్లిగూడెం రూరల్‌,  సెప్టెంబరు 24 : వైసీపీ పాలనలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు. శనివారం పట్టణంలోని కడకట్ల ప్రాంతం, మండలంలోని ఎల్‌.అగ్రహారంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్వానంగా ఉన్న కాలనీ రహదారుల వద్ద నిరసన తెలిపారు. పెరిగిన విద్యుత్త్‌, నిత్యావసర వస్తువుల ధరలను వ్యతిరేకిస్తూ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు అధ్యక్షతన స్థానికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. బాబ్జి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సీఎంగా చంద్రబాబునాయుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నాయకులు పాతూరి రాంప్రసాద్‌చౌదరి, శీలి వెంకటరత్నం, రాకేష్‌, సుందర రమాదేవి,  ముప్పిడి రమేష్‌, వాడపల్లి సుబ్బరాజు పాల్గొన్నారు. ఎల్‌.అగ్రహారంలో పార్టీ అధ్యక్షుడు పరిమి రవికుమార్‌, శీలి వెంకటాచలం, మర్లపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Read more