అప్పుడే మండిపోతోంది..

ABN , First Publish Date - 2022-03-05T05:44:38+05:30 IST

ఎండలు ముదురుతున్నాయి. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

అప్పుడే మండిపోతోంది..
నరసాపురంలో నిర్మానుష్యంగా రోడ్‌

రోజురోజుకు పెరుగుతున్న వేసవితాపం


నరసాపురం టౌన్‌, మార్చి 4 : ఎండలు ముదురుతున్నాయి. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో మధ్యా హ్నం ఒంటి గంట దాటితే రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. మార్చిలోనే ఎండలు బెంబేలెత్తిస్తుంటే.. ఇక ఏప్రిల్‌, మే నెలల్లో ఎలా ఉంటుందోనన్న భ యం ప్రజల్లో నెలకొంది. తీర ప్రాంతాల్లో అయితే వేడిగాలులకు ప్రజలు అల్లా డిపోతున్నారు.ఉష్ణోగ్రత పరిశీలిస్తే శుక్రవారం నరసాపురంలో 36 డిగ్రీలు నమో దైంది.ఈ వారం ఆరంభం నుంచి 34పైనే ఉంది. 

Read more