జోరుగా జూదం.. పోలీసులు దూరం..

ABN , First Publish Date - 2022-04-12T05:54:45+05:30 IST

చిగురుకోట పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గత కొంతకాలంగా కోత ముక్క (జూదం) జోరుగా సాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

జోరుగా జూదం.. పోలీసులు దూరం..

గ్రామస్థుల ఆగ్రహం

ముదినేపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 11: చిగురుకోట పరిసర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గత కొంతకాలంగా కోత ముక్క (జూదం) జోరుగా సాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కైకలూరు, మండవల్లి, గుడివాడ పరిసర ప్రాంతాల నుంచి జూదరులు వస్తున్నారని చెబుతున్నారు. చిగురుకోట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జూదం నిర్వహిస్తున్నారని, జూదంలో పాల్గొనే ఒక్కొక్కరి  నుంచి రూ. 500 చొప్పున వసూలు చేస్తూ పోలీసుల అనుమతి ఉందని ప్రచారం చేస్తూ జూదరులను ఫోన్లు ద్వారా రప్పిస్తున్నట్టు చెబుతున్నారు గ్రామానికి చెందిన కొందరు జూదరులు. భారీస్థాయిలో జూదం జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి జూదాన్ని అరికట్టాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-04-12T05:54:45+05:30 IST