విద్యార్థులకు క్రీడలు అవసరం : ఎస్పీ రవిప్రకాష్‌

ABN , First Publish Date - 2022-09-24T05:28:33+05:30 IST

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ అవసరమని పశ్చిమ గోదావరి ఎస్పీ రవిప్రకాష్‌ సూచించారు.

విద్యార్థులకు క్రీడలు అవసరం  : ఎస్పీ రవిప్రకాష్‌
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎస్పీ

భీమవరం, సెప్టెంబరు 23: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ అవసరమని పశ్చిమ గోదావరి ఎస్పీ రవిప్రకాష్‌ సూచించారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శ్రీసాగి రామకృష్ణంరాజు మెమోరియల్‌ పేరిట నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌–13 బాలురు, బాలికల బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. దీనికి ఎస్పీ ముఖ్య అతి థిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి... మాట్లాడుతూ నిరంతరం క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు చదువులో కూడా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగాల న్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఎం. జగపతిరాజు మాట్లాడుతూ కళాశాల జాతీయస్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి డా.పి. అంకమ్మ చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బ్యాడ్మింటన్‌ అకాడమీల ద్వారా వందలాది మంది క్రీడాకారులు తయారవుతున్నారని పేర్కొన్నారు. పూర్వపు 13 జిల్లాల నుంచి పెద్దఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను ఎస్పీ రవిప్రకాష్‌ పరిచ యం చేసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ ఎస్‌ ఆర్‌కేఆర్‌ నిశాంతవర్మ, అసిస్టెంట్‌ ఫిజికల్‌ డైరెక్టర్స్‌ డా.సిహెచ్‌ హరిమోహన్‌, జి. సారిక, జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మెంటే వంశీకృష్ణ, వీవీ సోమరాజు, కేఎస్‌ఆర్‌వీ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T05:28:33+05:30 IST