సెల్‌ పోయిందా..!

ABN , First Publish Date - 2022-11-30T00:33:29+05:30 IST

‘మీ సెల్‌ ఫోన్‌ పోయిందా..? వెంటనే 95503 51100 నెంబరుకు వాట్సప్‌ చేయండి. మేం వాటి ఆచూకీ కనిబెట్టి అందజేస్తాం’ అంటున్నారు ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ.

సెల్‌ పోయిందా..!

నలుగురు దొంగల అరెస్ట్‌.. 380 ఫోన్లు స్వాధీనం

ఏలూరు రూరల్‌, నవంబరు 29 : ‘మీ సెల్‌ ఫోన్‌ పోయిందా..? వెంటనే 95503 51100 నెంబరుకు వాట్సప్‌ చేయండి. మేం వాటి ఆచూకీ కనిబెట్టి అందజేస్తాం’ అంటున్నారు ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ. బస్సు, రైలు ప్రయాణీకులే లక్ష్యంగా సెల్‌ ఫోన్లు చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన సందర్భంగా ఆయన మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘ఏలూరు 5వ డివిజన్‌కు చెందిన సమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, లంబాడీపేటకు చెందిన పటాన్‌ రోజ్‌ఖాన్‌, కారపాటి నాగేంద్ర, మరో మైనర్‌ బాలుడు కలిసి ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణీకుల నుంచి చాకచక్యంగా సెల్‌ఫోన్లు మాయం చేస్తున్నారు. దొంగిలించిన వెంటనే వీటిని మరోవ్యక్తికి ఇచ్చేసి ప్రయాణీకులతో కలిసిపోతు న్నారు. ఏలూరు జిల్లా చరిత్రలోని సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న వారి కోసం వాట్సప్‌ నెంబర్‌ ఏర్పాటు చేయడంతో వీటికి వచ్చిన ఫిర్యా దుల ఆధారంగా వీటిపై దృష్టి సారించి దర్యాప్తు చేపట్టి నిందితుల ను అదుపులోకి తీసుకున్నాం. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి నాలుగు విడతలుగా స్వాధీనం చేసుకున్న మొత్తం 662 సెల్‌ ఫోన్‌ లను బాధితులకు అందజేస్తున్నాం. వీటిలో ఈ రోజు 380 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌పోన్‌ దొంగలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు నగదు బహుమతి అందజేశారు. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, సుబ్బారావు, ఈసిఎస్‌ సీఐ మురళీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:33:29+05:30 IST

Read more