భీమవరంలో స్థలాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ABN , First Publish Date - 2022-02-19T05:54:59+05:30 IST

జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ శుక్రవారం భీమవరంలో పలు స్థలాలను పరిశీలించారు.

భీమవరంలో స్థలాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

భీమవరం క్రైం, ఫిబ్రవరి 18 : జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ శుక్రవారం భీమవరంలో పలు స్థలాలను పరిశీలించారు. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు కానుండడంతో తాత్కాలికంగా ఎస్పీ కార్యాలయం, పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నిమిత్తం స్థలాలను చూశారు.ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారం పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో స్థలాన్ని ఇప్పటికే పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.జువ్వలపాలెం రోడ్డు, పెదఅమిరం ప్రాంతాల్లో స్థలాన్ని, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్న పాత పోలీస్‌ క్వార్టర్స్‌ను పరిశీలించారు.

Read more