తహసీల్దార్ కార్యాలయంలో పొడ పాము
ABN , First Publish Date - 2022-02-17T05:28:49+05:30 IST
తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం పొడ పాము దూరింది.
కామవరపుకోట, ఫిబ్రవరి 16: తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం పొడ పాము దూరింది. పామును చూసిన ఉద్యోగులు భయపడ్డారు. వెంటనే పాములు పట్టే భీమిరెడ్డి మోహన్‌రావును పిలిపించారు. అతడు కొద్దిసేపు కష్టపడి పామును పట్టుకున్నాడు.