అమర గాయకుడు ఘంటసాల

ABN , First Publish Date - 2022-12-04T23:42:18+05:30 IST

ఘంటసాల అమర గాయకుడని, ఆయన పాటలు ఏ తరం వారినైనా అలరిస్తాయని పట్టణ కళాకారుల సంఘం కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి అన్నారు.

అమర గాయకుడు ఘంటసాల
పాలకొల్లులో ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కళాకారులు

భీమవరం టౌన్‌, డిసెంబరు 4: ఘంటసాల అమర గాయకుడని, ఆయన పాటలు ఏ తరం వారినైనా అలరిస్తాయని పట్టణ కళాకారుల సంఘం కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి అన్నారు. ఘంటసాల జయంతి సందర్భంగా ఆదివారం ఘంట సాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధుర గానంతో శ్రోతలను ఉర్రూతలూగించారని, సంగీత దర్శకుడిగా ప్రతి భ చాటుకున్నారన్నారు. ఏపీ ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి ఎం.సీతా రామప్రసాద్‌ మాట్లాడుతూ నేటి తరం యువత కూడా ఘంటసాల పాటలను ఆదరించడం గొప్ప విషయమన్నారు. మూడు వేల గీతాలు ఆలపించిన ఘంటసాల విదేశాల్లో కూడా ఆదరణ పొందారన్నారు. ఎస్‌కె ఛాన్‌బాషా, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కొండ్రు శ్రీను, నరహరిశెట్టి కృష్ణ, పి శ్రీనివాస్‌, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

పాలకొల్లు అర్బన్‌: గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అద్భుత గానంతో అలరించారని పలువురు వక్తలు అన్నారు. ఘంటసాల శత జయంతిని పురస్కరించుకుని ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ వద్ద ఆదివారం ఘంటసాల సంగీత కళా పరిషత్‌, నటీ నట సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో పలువురు మాట్లాడారు. ఘంటసాల విగ్రహానికి పూల మా లలు వేసి నివాళులర్పించారు. గౌరవాధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌ రాజు, అధ్యక్షుడు కేఎస్‌పీఎన్‌.వర్మ, ప్రధాన కార్యదర్శి బొక్కా నరసింహమూ ర్తి, కొల్లి నరసింహమూర్తి, జక్కంపూడి కుమార్‌, చినమిల్లి గణపతిరావు, గాయకులు బీఎస్‌ఎన్‌.మూర్తి, నటీనట సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు కత్తుల రామమోహన్‌, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, గుడాల హరిబాబు, బైలా శ్రీధర్‌, జాగు సత్యనారాయణ, ఉన్నమట్ల కపర్ధి, తదితరులు పాల్గొన్నారు. గౌరీశంకర్‌ సంగీత నృత్య కళా అకాడమి విద్యార్థుల నృత్యాలు అలరించాయి.

ఆకివీడు: ఘంటసాల స్వరం తెలుగుజాతికి వరమని బలరాం ప్రతాప్‌కుమార్‌, ఎండీ మదనీ అన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఘంటసాల విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయకులు కందుల సత్యనారాయణ, ఎండీ మదనీ, షేక్‌ వల్లీ, గేదెల కనకారావు, నెల్లి బాల ఆదిత్యను ఘనంగా సన్మానించారు. ఘంటసాల గానామృతాలు, స్వరవిన్యాసాలు తెలుగు నేలలతో పాటు ఇతర దేశాల్లో ఈనాటికి వినిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సింగవరపు కోటేశ్వరరావు, కందుల సత్యనారాయణ, నెల్లి వెంకన్నబాబు, కుంకట్ల సత్యనారాయణ, గేదెల అప్పారావు, గంధం ఉమా, షేక్‌ హుస్సేన్‌, వేజెళ్ళ దిలీప్‌, ఎం.శ్రీహరిరాజు, గొంట్లా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T23:42:19+05:30 IST