నాట్లకు సిద్ధం

ABN , First Publish Date - 2022-08-04T05:50:43+05:30 IST

మండలంలో వరి నాట్ల కోసం పలు చోట్ల ఆయకట్టు భూముల్లో నారుమడులు ఎదురుచూస్తున్నాయి.

నాట్లకు సిద్ధం
బాలేపల్లిలో వరినాట్లకు సిద్ధంగా ఉన్న నారుమడులు

అధిక వర్షాలతో ఆలస్యం..

సా..గుతున్న సార్వా నాట్లు
మరో వారం రోజుల్లో వరి నాట్లు ముమ్మరం..
నారు కొరత తప్పదంటూ రైతుల ఆందోళన


వీరవాసరం, ఆగస్టు 3 : మండలంలో వరి నాట్ల కోసం పలు చోట్ల ఆయకట్టు భూముల్లో నారుమడులు ఎదురుచూస్తున్నాయి. ఆగస్టు మొదటి వారానికే దాదాపు 60 శాతంపైగా పూర్తి కావాల్సిన సార్వా నాట్లు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. అధిక, భారీ వర్షాల కారణంగా చేలు ముంపునకు గురై మురుగునీరు కాల్వలు లాగక నారుమడులు మునిగిపోవడం వల్ల రైతులు ప్రారంభంలోనే నష్టాన్ని చూశారు.  రెండో విడతగా నారుమడుల వేసేందుకు సిద్ధపడినప్పటికీ చేలల్లో నీరు లాగకపోవడంతో    నారుమడులు వేసేందుకు భూమి సహకరించకపోవడంతో సాగులో వెనుకపడ్డారు. నందమూరుగరువు, బాలేపల్లి, బొబ్బనపల్లి, మెంటేపూడి, వీరవాసరం, మత్స్యపురి ఆయుకట్టు భూమికి చెందిన మురుగు తొక్కోడు ద్వారా గొంతేరులో కలుస్తుంది. భారీవర్షాలతో తొక్కోడు, రాణికోడు, మెంటేపూడి మురుగుకాలువ ముంపునీరు తొలగిన అనంతరం రైతులు నారుమడులు వేశారు. ఇవి ప్రస్తుతం వరినాట్లకు సిద్ధమయ్యాయి. మండలంలోని పలు ఆయకట్ట భూముల్లో వరినాట్లు పూర్తయి తొలివిడత మందు కూడా వేశారు. మరోవైపు వీరవాసరం నుంచి మత్స్యపురి వరకు తొక్కోడు వెంబడి ఉన్న ఆయకట్టు భూముల్లో నేటికీ వరినాట్లు పడని పరిస్థితులు నెలకొన్నాయి. మరో వారం రోజుల్లో వరినాట్లు జోరందుకుంటాయని అయితే నారుకొరత తప్పదని రైతులు తెలుపుతున్నారు

Updated Date - 2022-08-04T05:50:43+05:30 IST