TDP: సరిపల్లి గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’
ABN , First Publish Date - 2022-12-23T20:32:33+05:30 IST
కొయ్యలగూడెం మండలం, సరిపల్లి గ్రామంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): కొయ్యలగూడెం మండలం, సరిపల్లి గ్రామంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బొరగం ఆరా తీశారు. ప్రజా సమస్యలను తెలుసుకుని నమోదు చేసుకున్నారు. టీడీపీ (TDP) ప్రజల తరుపున చేస్తున్న పోరాటానికి మద్దతుగా +91- 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని శ్రీనివాసులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కంకిపాటీ బాబురావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పారేపల్లి రామారావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు వేమా శ్రీను, క్లస్టర్ ఇంచార్జి పారేపల్లి నరేష్, యూనిట్ ఇంచార్జీ కనుమూరి సీతారామరాజు, తెలుగుమహిళా నియోజకవర్గం అధ్యక్షురాలు కుంజం సుభాషిణి, తెలుగుయువత నియోజకవర్గం అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, బాలం గంగాధర్, బిసి సాధికారిక రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సుభానీ, మండల తెలుగుమహిళా అధ్యక్షురాలు ఆకుల అరుణ, తెలుగుమహిళా మండల ఉపాధ్యక్షురాలు కాకి లక్ష్మి, మండల తెలుగుమహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెండ్యాల రమాదేవి, చెరుకూరి రమ్య, ఘంటా దుర్గారావు, తొంట దుర్గాప్రసాద్, ఆనంద్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
