పందెం బరులు బేరం
ABN , First Publish Date - 2022-01-13T05:41:31+05:30 IST
ఓ వైపు నిషేధం ఉన్నా.. మరోవైపు న్యాయస్థానాలు హెచ్చరించినా కోడి పందేలకు మాత్రం బరులు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల వేలాలు.. మరికొన్ని చోట్ల బేరాలు. పండుగ మూడు రోజులు యఽథేచ్ఛగా బరిలో కోళ్ల కొట్లాటకు.. బయట కోసాట, ఆపైన గుండాటకు రెడీ అవుతున్నారు.
రహస్య భేటీలు.. వీలైనంత రాబట్టేందుకు చక్రం తిప్పుతున్న నేతలు
ముందస్తు సిగ్నల్‌కు టెన్షన్.. ఈసారి పాత తీరేనంటూ ప్రచారం
పందేలు జరగనివ్వమంటున్న పోలీసులు.. అదేబాటలో రెవెన్యూ
తగ్గేదేలే అంటూ గుట్టుగా పందెం రాయుళ్ల ముమ్మర ఏర్పాట్లు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఓ వైపు నిషేధం ఉన్నా.. మరోవైపు న్యాయస్థానాలు హెచ్చరించినా కోడి పందేలకు మాత్రం బరులు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల వేలాలు.. మరికొన్ని చోట్ల బేరాలు. పండుగ మూడు రోజులు యఽథేచ్ఛగా బరిలో కోళ్ల కొట్లాటకు.. బయట కోసాట, ఆపైన గుండాటకు రెడీ అవుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా పందేలు సాగుతాయంటూ కొందరు స్థానిక నేతలు చేసిన ప్రచారం, సంప్రదాయం పేరిట సాగే కోడి పందేలకు అంతా సిద్ధమే అంటూ చేసిన ఆర్భాటంతో కొందరు అత్యాశకు దిగుతున్నారు. రింగ్ మాస్టర్లకు అంతో ఇంతో ముట్టచెప్పి ఈ మూడు రోజులు ఎడాపెడా దోచేయడానికి సిద్ధపడుతున్నారు. ఎవరికి తోచినట్టు వారు ఇప్పటికే కొందరితో బేరాలు కుదుర్చుకున్నారు. అనధికార సిగ్నల్ పడిన వెంటనే క్షణాల్లో బరులు తెరిచేందుకు సూత్రధారులు, పాత్రధారులు బిజీగా ఉన్నారు. ఆగేదేలే.. అంటూ తెగ రెచ్చిపోనున్నారు.
ఎక్కడికక్కడ బేరాలు.. ఆపైన వేలాలు
గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. సంక్రాంతికి మూడు నెల లు ముందుగానే సరంజామ సిద్ధం చేస్తుంటారు. పండుగ మూడ్రోజులు నాలు గు చేతులా సంపాదించడానికి వీలుగా పెద్ద తలకాయలు రంగంలోకి దిగు తాయి. బరులను బేరం పెడతారు. పోటీ పెంచి వచ్చే సొమ్ము రెండింతలు దక్కేలా చూసుకుంటారు. ‘‘పందేలు వేస్తే సహించేది లేదు. ధిక్కరణకు పాల్పడ ితే తాట తీస్తాం. కేసులు పెడతాం. పందేలు నిర్వహించొద్దు. కుటుంబ సమే తంగా పండుగను ఆస్వాదించండి’’ అంటూ పోలీసులు గడిచిన పక్షం రోజులు గా పదేపదే చెబుతూనే వచ్చారు. ఊరూవాడా ప్రజా చైతన్య సదస్సులు నిర్వ హించారు. ఎక్కడెక్కడ కోడి పందేలకు దిగాలనుకుంటున్నారో ముందుగానే గ్రహించి వేసిన బరులను ధ్వంసం చేశారు. మరోవైపు ‘‘సర్కారు దృష్టికి తీసు కువెళ్లి ఈ మూడు రోజులపాటు పందేలకు అనుమతులు ఇప్పించండి అంటూ పది రోజులుగా పెద్ద తలకాయులను కొందరు వేడుకుంటూనే ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు పందేలు వేసుకునే హక్కు తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడ బరి వేయాలో, ఎక్కడ పందేలకు గిరి గీయాలో ఒక రహస్య అవగాహనకు వచ్చేశారు. మూడో కంటి కి తెలియకుండా గుండాట నిర్వహించే వారితో సంప్రదింపులు నిర్వహించారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు ప్రతీ ఏటా పెద్దపండుగ వేళ ఇక్కడికే తరలివస్తారు. వీరంతా గుండాట, కోతాట నిర్వహ ణలో సిద్ధహస్తులు. కొందరు రింగ్‌గా ఏర్పడి ఎవరైతే నిర్వహణ సామర్ధ్యం ఉందో వారిని ఆశ్రయించి బేరాలకు దిగుతారు. ‘బరుల్లో పందెం ఒక్కటే కాదు.. గుండాట అయితే 20 లక్షలు. అదే కోతాట అయితే 30 లక్షలు. ఇక తిండి, ఇతరత్రాకు అయితే ఐదు లక్షలు. ఎవరి మామూళ్లు వారికి మీరే ఇచ్చు కోవాలి. మాకెంత ఇస్తారో చెప్పండి. ఈ మూడు రోజులు ఏ లోటు జరగకుండా చూసే బాధ్యత మాది’ అంటూ రహస్య వర్తమానాలు పంపినట్టు చెబుతున్నారు. వామ్మో.. ఏంటి ఈసారి ఇంత స్పీడుగా ఉన్నారు అంటూ కృష్ణా, గుంటూరు నుంచి ప్రతీ ఏటా వచ్చే కొందరు వెనక్కి తగ్గగా, తూర్పుగోదావరి నుంచి వచ్చేవారు మాత్రం.. చెప్పిన ఫిగరు కాస్త ఎక్కువే. ఇంత కట్టుకోలేం. పదో, పదిహేనో అంటే మేము సిద్ధమే అని రింగ్ మాస్టర్లకు తమవారితో మాట్లాడించారు. ఉండి, నరసాపురం, పోలవరం వంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే కొందరు భారీగా ‘ధర’లు పెంచేయడం అంద రినీ ఖంగు తినిపిస్తోంది. కోడి పందేల్లో సిద్ధహస్తులైన ఒక మాజీ ప్రజాప్రతినిధి ఒకరు బరుల నిర్వహణకు ఏకంగా 25 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడినట్టు ప్రచారం సాగుతోంది.
ఇంతకీ సిగ్నల్ ఎప్పుడు ?
సంక్రాంతి వేళ కోడి పందేలకు ఎప్పుడు సిగ్నల్ లభిస్తుందా అని ఎదురు చూస్తుంటారు. గత ఏడాది కూడా చివరి క్షణం వరకు అంతా టెన్షన్. అసలు పందేలు జరగవంటూ అప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం. కాని భోగి పండుగ నాడు ఉదయం 7–8 గంటల సమయం నాటికి పందేలేసుకోవచ్చహో.. అంటూ వాట్సప్ గ్రూపుల్లో ఎక్కడికక్కడ సంకేతాలు. అంతే ఉదయం 9 గంటలకల్లా క్షణాల్లో బరులు వెలిశాయి. ఈసారి కూడా అదే జరుగుతుం దని అధికార పక్ష నేతలు ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులను కలిసిన కొందరు ఏదో రకంగా పందేలు వేసుకోవడానికి అనుమతి వచ్చేలా చూడండంటూ మంత్రు లు, ఎమ్మెల్యేలను వేడుకున్నారు. పోలీసులైతే చూస్తూ ఊరుకోబోమని, చట్టపరిధిలో చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రెవెన్యూ అప్రమత్తమైంది. పండుగ మూడు రోజులు కోడి పందేలు, పేకాట, గుండాట వంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని తాజాగా జేసీ అంబేడ్కర్ ఆదేశాలు జారీచేశారు.
చర్యలు తప్పవు
రాహుల్‌దేవ్ శర్మ, జిల్లా ఎస్పీ
కోడి పందేల నిర్వహణను అడ్డు కునేలా అన్ని చర్యలు తీసుకున్నా మని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటి వరకు 3,700 మందికిపైగా బైండోవర్ కేసులు పెట్టామని, 355 బరులను గుర్తించామని, కొన్నింటిని ధ్వంసం చేశా మన్నారు. 4,500 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎక్కడైనా సరే చట్టాన్ని అతిక్రమించి చర్యలకు దిగితే సహించేదిలేదని హెచ్చరించారు.
