ముగిసిన ఎడ్ల పందేలు

ABN , First Publish Date - 2022-01-13T05:48:55+05:30 IST

సంక్రాంతి సంబరాల సందర్భంగా చాటపర్రులో రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల పోటీలు హోరెత్తించాయి. పోటీల్లో 28 ఎడ్ల జతలు పాల్గొన్నాయి.

ముగిసిన ఎడ్ల పందేలు
చాటపర్రులో ఎడ్ల పందేలు

 ఏలూరు రూరల్‌, జనవరి 12 : సంక్రాంతి సంబరాల సందర్భంగా చాటపర్రులో రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల పోటీలు హోరెత్తించాయి. పోటీల్లో 28 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. చెక్కబండిని తాళ్ళతో కట్టి బరువును లాగే పోటీని చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు. రెండో రోజు బుధవారం ముగింపు కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, పెదవేగి ఆయిల్‌ఫాం చైర్మన్‌ కొఠారు రామచంద్రరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన ఎడ్ల జతకు రూ. 30 వేలు, ద్వితీయ స్థానం ఎడ్ల జతకు రూ.20 వేలు, తృతీయ స్థానానికి రూ.15 వేలు నగదు పురస్కారం అందజేశారు. సర్పంచ్‌ గుడిపూడి రఘు, వైపీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-13T05:48:55+05:30 IST