ఏం జరుగుతోంది..?
ABN , First Publish Date - 2022-11-14T00:03:50+05:30 IST
రాష్ట్రంలోని ఏ మునిసిపాల్టీలోనైనా పారిశుధ్య నిర్వహణ అంతా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చూసుకుంటారు.
భీమవరం మునిసిపాల్టీలో ఉత్సవమూర్తులుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు
అంతా శానిటరీ, అండ్ ఎన్విరాన్‌మెంటల్ కార్యదర్శులదే
భీమవరం టౌన్, నవంబరు 13 : రాష్ట్రంలోని ఏ మునిసిపాల్టీలోనైనా పారిశుధ్య నిర్వహణ అంతా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చూసుకుంటారు. కార్మికులకు మస్తర్ వేయాలన్నా, ఏ రోజు ఏ ఏ పనులు చేయాలి ?, డ్రెయిన్లు శుభ్రపరచడం, దోమల నివారణ మందు పిచికారి చేయించటం, డీఅండ్‌వో ట్రేడ్స్ పన్నులు వసూలు చేయడం అంతా వీరి చేతుల్లోనే నడు స్తుంది. కానీ, భీమవరం మునిసిపాల్టీలో ఏం జరిగిందో తెలియదు. కానీ, రెండు నెలలుగా పారిశుధ్య నిర్వహణ అంతా సచివాలయాల్లోని శానిటరీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ కార్యదర్శులకు అప్పగించారు. మునిసిపాల్టీలోని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉత్సవమూ ర్తులుగా మారిపోయారు. ఇలా ఎందుకు జరిగిందో అనే దానిపై స్పష్టత కనిపించడం లేదు. భీమవరం మునిసిపాలిటీలో పర్మినెంట్ శానిటరీ ఇనస్పెక్టర్లు ఇద్దరు, హెల్త్ అసిస్టెంట్‌లు, మరో ఐదుగురు హెల్త్ అసిస్టెంట్‌లు ఇన్‌చార్జ్ ఇనస్పెక్టర్‌లుగా శానిటరీ పర్య వేక్షణ నిర్వహిస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు శాని టరీ విధుల్లో అంతా తామై వ్యవహరించారు. శానిట రీ సిబ్బందిపై అజమాయిషీ ఉండేది. సెలవులు మం జూరు చేసే అధికారం ఉండేది. ఇప్పుడు కేవలం పర్య వేక్షణకే పరిమితమయ్యారు.
పట్టణంలోని 39 సచివాలయాలల్లో 39 మంది శానిటరీ అండ్ ఎన్వీరాన్‌మెంట్ కార్యదర్శులు ఉన్నా రు. పారిశుధ్యం దగ్గర నుంచి కార్మికునికి సెలవు ఇవ్వాలన్నా, చెత్త పన్ను వసూలు చేయాలన్నా, ప్రతీ బాధ్యత ఇప్పుడు వారికి అప్పగించారు. దీంతో శాని టరీ ఇనస్పెక్టర్లు ఏ బాధ్యత నిర్వర్తించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపా లిటీల్లోనూ రెండు రోజుల వరకు శానిటరీ ఇనస్పెక్ట ర్‌లే సెలవులు ఇచ్చే విధానం ఉంది. భీమవరంలో మాత్రమే మార్పులు చోటు చేసుకున్నా యి. మునిసిపాల్టీకి ప్రత్యేక అధికారి వచ్చిన తరువాత శానిటరీ ఇనస్పెక్టర్ల కు అన్ని బాధ్యతలు కొనసాగాయి. కానీ, ఏం జరిగిందో ఇటీవల వాటిని తీసేశారు. ఒక్క కార్యదర్శులకే అజమా యిషీ అప్పగించారు. పారిశుధ్య నిర్వ హణ పరిశీలన మాత్రమే శానిటరీ ఇనస్పెక్టర్లకు కొనసాగిస్తున్నారు. పారి శుధ్య సిబ్బందికి సెలవులు కావాలంటే కార్యదర్శులు అనుమతి ఇస్తున్నారు. అధికంగా సెలవు కావాలంటే ఆపైన శానిటరీ ఇనస్పెక్టర్‌లకు బాధ్యత అప్పగించాలి. కానీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు కాకుండా పై అధికారుల స్థాయిలోనే సెలవు ఇచ్చే బాధ్యత పెట్టారు. దీనివల్ల శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ల అంటే సిబ్బందిలో చులకనబావం ఏర్ప డుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.