యాత్రికులతో కిటకిటలాడిన క్షీరారామం
ABN , First Publish Date - 2022-11-20T23:45:06+05:30 IST
కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో పంచారామ క్షేత్ర యాత్రికుల రద్దీ నెలకొంది.
పాలకొల్లు అర్బన్, నవంబరు 20 : కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో పంచారామ క్షేత్ర యాత్రికుల రద్దీ నెలకొంది. క్షీరా రామ లింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జామునుంచి క్యూలైన్లలో నిలిచారు. సుమా రు 40వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ వర్గాల అంచనా. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అమ్మవార్లకు పూజలు చేశా రు. ఆలయ ప్రాంగణంలో గోశాల వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగిం చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది, పట్టణ పోలీసులు, వలంటీర్లను ఏర్పాటు చేశారు. ఈవో యాళ్ళ సూర్యనారా యణ, పాలక మండలి చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు, ట్రస్టీలు, వలంటీర్లు పాల్గొన్నారు. శంకరమఠంలోని అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామికి, శంభేశ్వర స్వామికి అభిషేకాలు, లక్షపత్రి పూజలు నిర్వహించారు.
మండలంలోని వాయు త్రిలింగ క్షేత్రాలైన దిగమర్రు ఉమాసోమేశ్వర స్వామి, శివదేవుని చిక్కాలలోని శివదేవస్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. లంకలకోడేరు, దగ్గులూరు, వెం కటాపురం, వెలివెల, ఆగర్రు, చింతపర్రు, భగ్గేశ్వరం, వడ్లవానిపాలెం శివాల యాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.
ఉమాసోమేశ్వరస్వామికి లక్షపత్రి పూజ
యలమంచిలి: ఉమాసోమేశ్వరస్వామి ఆలయంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్వామివారికి లక్షపత్రి పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు యలమంచిలి నరేంద్రశర్మ, పలు వురు వేదపండితులు స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకాల అనంత రం మారేడు బిల్వలతో లక్షపత్రి పూజ చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేశారు. పార్వతిదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు నిర్వ హించారు. యలమంచిలి సత్యనారాయణమూర్తి, కోడూరి రామలింగజ్యోషి, భాగవతుల లక్ష్మీనర్శింహమూర్తి, నాని, శర్మ, ఆంజనేయులు పాల్గొన్నారు.
జుత్తిగ సోమేశ్వరస్వామికి లక్షపత్రి పూజ
పెనుమంట్ర: జుత్తిగలోని ఉమావాసుకీ రవిసోమేశ్వరస్వామికి లక్షపత్రి పూజ నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఆలయ అర్చకులు ర్యాలీ వాసు, రామకృష్ణశర్మ, గణేష్‌శర్మ, పవన్ శర్మ, వేదపండితుడు వేమూరి పణీంద్రశర్మ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సహస్ర నామాలతో లక్షపత్రి పూజ నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమంలో ఈవో సాయిప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.