రూ.2,116 విరాళం.. రూ.8 కోట్లకు రశీదు

ABN , First Publish Date - 2022-06-12T06:52:46+05:30 IST

చినవెంకన్నకు రూ.2,116 విరాళం ఇస్తే.. ఆలయ అధి కారులు ఎనిమిది కోట్లకు రశీదు ఇచ్చి సంచలనం సృష్టించారు.

రూ.2,116 విరాళం.. రూ.8 కోట్లకు రశీదు

ద్వారకా తిరుమల, జూన్‌ 11 : చినవెంకన్నకు రూ.2,116 విరాళం ఇస్తే.. ఆలయ అధి కారులు ఎనిమిది కోట్లకు రశీదు ఇచ్చి సంచలనం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 9వ తేదీ సాయంత్రం ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తణుకుకు చెందిన ఒక భక్తుడు శ్రీ వారి నిత్యాన్నదాన ట్రస్టుకు  రూ.2,116 విరాళం చెల్లించాడు. అయితే అతను రూ.8 కోట్లు చెల్లించినట్లు సదరు ఉద్యోగి పొరపాటున ఆన్‌లైన్‌లో నమోదు చేశాడు. ఆ రోజు సాయంత్రం డీసీఆర్‌ క్లోజ్‌ చేసే సమయంలో నగదులో కోట్లాది రూపా యల మేర తేడా రావడంతో హడలిపోయిన అధికారులు క్షుణ్ణంగా పరి శీలిస్తే అసలు విషయం బయటపడింది. ఇంతకీ సదరు ఉద్యోగి భక్తుడి చ్చిన నగదును నమోదు చేయాల్సినచోట పొరపాటున అతని ఆధార్‌ నెంబరును ఎంటర్‌ చేశాడు. కంగుతిన్న అధికారులు తప్పును సరిచేసే పనిలో పడ్డారు. ఇది కమిషనర్‌ కార్యాలయ స్థాయిలో జరగాల్సి ఉంటుం దని తెలుస్తోంది. నగదు లావాదేవీలు జరిగే కీలక ప్రదేశాల్లో అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను ఉంచొద్దు అని గతంలో దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. 

Updated Date - 2022-06-12T06:52:46+05:30 IST