రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-05-30T05:48:57+05:30 IST

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని వన్‌టౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణ అన్నారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌
కౌన్సెలింగ్‌ చేస్తున్న ఎస్‌ఐ రామకృష్ణ

ఏలూరు క్రైం, మే 29: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని వన్‌టౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణ అన్నారు. ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌కు నిర్వహించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ రౌడీషీటర్లకు సత్‌ప్రవర్తన ఒక్కటే మార్గమని, చుట్టుపక్కల అందరితో మంచి జీవనాన్ని సాగించాల న్నారు. సత్‌ప్రవర్తన కలిగి వున్నవారిపై రౌడీషీట్‌లు తొలగించడా నికి సిఫారసు చేస్తామన్నారు. రౌడీకార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

Read more