మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మళ్లీ తనిఖీలు

ABN , First Publish Date - 2022-12-07T00:35:26+05:30 IST

మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన కార్యకలాపాల పై మంగళవారం తహసీల్దార్లు తనిఖీలు నిర్వ హించారు.

మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మళ్లీ తనిఖీలు

మొగల్తూరు, డిసెంబర్‌ 6 : మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన కార్యకలాపాల పై మంగళవారం తహసీల్దార్లు తనిఖీలు నిర్వ హించారు. గత నెల 25న ఇదే కార్యాలయంలో ప్రభుత్వ భూములు, నిషేధిత భూములకు రిజి స్ట్రేషన్‌లు జరిగాయని వచ్చిన ఫిర్యాదులపై సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ తనిఖీలు చేశారు. ఆ సమ యంలో గడచిన రెండు మాసాల్లో నిషేధిత, ప్రభుత్వ, గ్రామ కంఠం భూములకు సంబంధిం చి 111 రిజిస్ట్రేషన్‌లు జరిగినట్టు ధ్రువీకరించా రు. ఇలా రిజిస్ట్రేషన్‌లు చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ జీవన్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశా రు. ఈ భూములపై జరిగిన రిజిస్ట్రేషన్‌లను మరోసారి పరిశీలించాలని వచ్చిన ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు మంగళవారం పోడూరు, ఆచంట, యలమంచిలి తహసీల్దార్లు సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు.

Updated Date - 2022-12-07T00:35:28+05:30 IST