కొవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది నియామకాలు

ABN , First Publish Date - 2022-01-13T05:44:31+05:30 IST

కొవిడ్‌ మూడో దశలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున జిల్లా వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

కొవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది నియామకాలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 12 : కొవిడ్‌ మూడో దశలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున  జిల్లా వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రారంభించనున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకాలు ప్రారంభించారు. తొలి విడతగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం 50 మంది వివిధ కేడర్ల వైద్య సిబ్బందిని నియమించేందుకు నిర్ణయించారు. మలి విడతలో మరిన్ని నియామకాలకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కూడా చేపట్టారు.  

Updated Date - 2022-01-13T05:44:31+05:30 IST