బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-12-31T01:17:48+05:30 IST

బాలికపై అత్యాచార యత్నం చేసిన యువ కుడిపై శుక్రవారం ముసునూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

 బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు

ముసునూరు, డిసెంబరు 30: బాలికపై అత్యాచార యత్నం చేసిన యువ కుడిపై శుక్రవారం ముసునూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ కుటుంబరావు వివరాల ప్రకారం వేల్పుచర్లకు చెందిన నాలుగో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 25న తన బంధువుల ఇంటివద్ద ఆడు కుంటుం డగా గ్రామానికి చెందిన దోమతోటి నాగ అచ్చియ్య అనే యువకుడు చాక్లెట్‌ ఇస్తానని బాలికను పిలిచి అత్యాచారానియి యత్నించగా బాలిక కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడు. యువకుడి కోసం బాలిక బంధువు లు మూడు రోజులు వెతికినా కనపడకపోవడంతో బాలిక తండ్రి ఫిర్యాదు మే రకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-12-31T01:17:48+05:30 IST

Read more