అనుబంధాలకు ప్రతీక రాఖీ
ABN , First Publish Date - 2022-08-13T05:47:54+05:30 IST
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాలకు ప్రతీక రాఖీ పండుగ అని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

ఆకివీడు/వీరవాసరం/కాళ్ల/ఆచంట/పాలకొల్లుఅర్బన్/భీమవరం టౌన్/ పెను గొండ, ఆగస్టు 12 : అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాలకు ప్రతీక రాఖీ పండుగ అని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే రామరాజుకు ఆకివీడులో టీడీపీ ప్లోర్ లీడర్ బొల్లా వీరశ్వేత, టీడీపీ –జనసేన కౌన్సిలర్లు బత్తుల శ్యామల, మోపిదేవి సత్యవతి, గుర్రాన నాగలక్ష్మి, నేరెళ్ళ ప్రసన్న, బచ్చు సరళాకుమారి, బొర్రా సుజాత రాఖీలు కట్టారు. వీరవాసరంలో జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడుకు జడ్పీటీసీ కార్యాలయంలో ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, ఎంపీటీసీ సభ్యులు జి.విజయలక్ష్మి, వర్ధినీడి వెంకటలక్ష్మి, యాళ్ళబండి ఇందిర, కందుకూరి విజయకుమారి, గోడి ఆదిలక్ష్మి, వీరమహిళలు రాఖీలు కట్టారు. హిందూ ధర్మ ప్రచార థార్మిక కమిటీ , సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కాళ్ల మండలంలో ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుకి నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగు మహిళలు రాఖీలు కట్టారు. ఆచంటలో భవ్యభారతి విద్యానికేతన్‌లో రరాకీ పండుగ ఘన ంగా నిర్వహించారు. పాలకొల్లు పట్టణంలో పలు సేవా సంస్థలు, ఓం శాంతి బ్రహ్మకుమారీలు సరస్వతి శిశుమందిరం, విద్యాభవన్స్ విద్యార్థులు రాఖీ పండుగను జరుపుకున్నారు. ఎల్ఆర్పేటలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌కు పలువురు తెలుగు మహిళలు, బ్రహ్మకుమారీ సభ్యులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం పట్టణంలో విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో పలువరు అధికారులకు, ప్రముఖలకు రాఖీలను కట్టారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సీఎస్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాఖీ పండుగ నిర్వహించారు. సెయింట్ మేరీస్ ఆసుపత్రి సుపీరియర్ డాక్టర్ మేరీ రాఖీ పండుగ విశిష్టతను తెలిపారు. బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖలకు రాఖీలు కట్టారు. శాశనమండలి చైౖర్మన్ కొయ్యే మోషన్రాజకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు పెనుగొండ భాష్యం, శ్రీచైతన్య స్కూలులో విద్యార్థినులచే రాఖీలు కట్టించి వేడుకగా నిర్వహించారు.
