మల్లికార్జునస్వామికి అభిషేకాలు

ABN , First Publish Date - 2022-03-21T05:37:42+05:30 IST

భ్రమరాంబ సమేత ఉద్దండ మల్లికార్జునస్వామికి లక్ష బిల్వార్చన, అభిషేకాలు నిర్వహించారు.

మల్లికార్జునస్వామికి అభిషేకాలు
అభిషేకాలు నిర్వహిస్తున్న పండితులు

కొవ్వూరు, మార్చి 20: భ్రమరాంబ సమేత ఉద్దండ మల్లికార్జునస్వామికి లక్ష బిల్వార్చన, అభిషేకాలు నిర్వహించారు.  దొమ్మేరు మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకులు శివకోటి రవిప్రసాద్‌ ఆధ్వర్యం లో ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో సూరంపూడి శ్రీనివాసరావు, వైవీవీ.సత్యనారాయణ మూర్తి,  చవలి దుర్గాప్రసాద్‌, లంక రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-21T05:37:42+05:30 IST