పొమ్మనలేక పొగ

ABN , First Publish Date - 2022-07-30T04:52:38+05:30 IST

సర్వం కోల్పోయిన బాధితుల పట్ల అధికారులు కక్ష పూరి తంగా వ్యవహరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

పొమ్మనలేక పొగ
పునరావాసంలో ఇలా..

దుర్భరస్థితిలో నిర్వాసితులు.. ఉడికీ ఉడకని అన్నం.. 

పనిచేయని వైద్యుల మాత్రలు : బాధితుల గగ్గోలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

సర్వం కోల్పోయిన బాధితుల పట్ల అధికారులు కక్ష పూరి తంగా వ్యవహరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉడికీ ఉడకని భోజనం పెడుతున్నారని వాపోయారు. వీరిని పొమ్మనలేక పొగపెట్టినట్లు.. ఒక్కొక్కటిగా సౌకర్యాలను తొలగిస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలకు ఫోజులివ్వడంతో సరిపెట్టిన  సీఎం ఆయన పర్యటన తమను వెక్కిరించినట్టు ఉందని బాధితులు మండిపడుతున్నారు. తమ గుమ్మం ముందు కొచ్చి పరామర్శించిన మాజీ సీఎం చంద్రబాబు పర్యటనను బాధితులు బేరీజు వేసుకుంటున్నారు. సౌకర్యాల కొరత తీర్చలేని అధికారులు ఇప్పుడు ఏకంగా బాధితులను నడిరోడ్డుపై నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటం వారి ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. వేలేరుపాడు మండలం శివకాశీపురం, బండ్ల బోరు, కుక్కునూరు మండలం తదితర పునరావాస కేంద్రాల్లో సమస్యలు కొకొల్లలుగా ఉన్నాయి. తాత్కాలిక మరుగుదొడ్లను రెండు రోజుల్లో తొలగిస్తామని అధికారులు ప్రకటిం చారు. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం మూడేళ్లుగా ఎదు రుచూస్తున్న వారికి ఈ ప్రభుత్వం అడుగడుగునా చేదు అనుభవం రుచి చూపి స్తోంది. అర్హత ఉన్నప్పటికీ.. వంకలు వెతుకుతూ అధికారులు పలువురు నిర్వాసితులను పక్కన పెడుతున్నారు. అడిగితే లంచాలు కావాలని, అధికార పార్టీ బ్రోకర్లతో అడిగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని కొందరు రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కయ్యి లంచాలకు తెగబడుతున్నారని చెబుతున్నారు. వేలేరుపాడు అధికారులపై ఇదే విషయంలో గడిచిన చంద్రబాబు పర్య టనలో ఫిర్యాదులు అందాయి. రూ.ఆరు లక్షల ప్యాకేజీ కోసం లక్షన్నర లంచం అడుగు తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని  బాధితులు కోరుతున్నారు. ముగ్గురు సభ్యులున్న కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ప్యాకేజీ ఇస్తున్న అధికారులు మిగిలిన వారికి ఎందుకు ఇవ్వట్లేదో సమాధానం చెప్పాల్సి ఉంది. 

అధికారులు పొమ్మంటున్నారు : అన్నపూర్ణ, వేలేరుపాడు

నేను ఎస్సీ కాలనీలో ఉంటున్నా.. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కూలిపోయింది. ఇప్పుడే మో అధికారులు పునరావాస కేంద్రం నుంచి పొమ్మంటున్నారు. ఎక్కడికి వెళ్లాలి. ఇస్తా మన్న ఇల్లు పూర్తి చేయలేదు. గవర్నంట్‌ డాక్టర్లు ఇచ్చే టాబ్లెట్లు అస్సలు పనిచేయడం లేదు. మా కష్టాలు ఏ ఒక్కరికీ చెప్పుకున్నా.. కసురుకునేవాళ్లే.. కనికరించేవాళ్లు లేరు. 

సర్వే జాబితా ఎక్కడ? : ముత్యాలరావు, సుద్దగంప

45.75కు ప్యాకేజీ ఇవ్వమని ఏ నోటి తో చెప్తున్నారు.. అసలు సర్వే చేశారా.. చేస్తే ఆ జాబితా మీడియా ముందు ప్రవేశ పెట్టాలి. కలెక్టర్‌, సీఎం అది చే శాం. ఇది చేశామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇక్కడ చూస్తే అంత స్థాయిలో చర్యలు లేవు. సీఎం పరామర్శకని ఎందుకొచ్చారో.. 


Updated Date - 2022-07-30T04:52:38+05:30 IST