అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది

ABN , First Publish Date - 2022-12-16T00:22:18+05:30 IST

ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని డీవై ఈవో దర్బా శ్రీరామ్‌ అన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది
భీమవరం మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థుల నివాళి

భీమవరం ఎడ్యుకేషన్‌ / అర్బన్‌, డిసెంబరు 15: ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని డీవై ఈవో దర్బా శ్రీరామ్‌ అన్నారు. భీమవరంలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్‌ హైస్కూల్లో సర్వోదయ మండలి ఆధ్వర్యంలో గురువారం పొట్టి శ్రీరా ములు 70వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. డివైఈవో శ్రీరామ్‌ మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన దేశభక్తుడన్నారు. రాష్ట్ర సాధన కోరకు ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు పోరాట పటిమ స్ఫూర్తిదాయకం అన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రపై పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్ధులకి బహుమతులు అందించారు. చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, హెచ్‌ఎం సుధారాణి, తదితరులు పాల్గొన్నారు. డీఎన్నార్‌ కళాశాలలో ఏవో పి.రామకృష్ణంరాజు, ప్రిన్సిపాల్‌ సోమరాజు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనిల్‌దేవ్‌, ప్రొఫెసర్లు జ్యోతి, గౌతమ్‌కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, వాణిజ్య విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు గునుపూడి తిరుపాల్‌ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెంటే పార్థసారధి, కోళ్ళ నాగేశ్వరరావు, మామిడిశెట్టి ప్రసా ద్‌, కోళ్ళ నాగబాబు, మద్దులరాము, మెంటే గోపి తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లు అర్బన్‌: అమరజీవి పొట్టి శ్రీరాములుకు వర్ధంతి సంద ర్భంగా వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో పలుచోట్ల విగ్ర హాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ ప్రాథమిక పాఠ శాలలో జరిగిన కార్యక్రమంలో మామిడి బాబు విద్యార్థులకు విద్యా సామగ్రి, బిస్కెట్లు పంపిణీ చేశారు. మఠం వీధి, గాంధీ బొమ్మల సెంటర్‌, రామ గుండం సెంటర్‌, ప్రభుత్వ ఆసుపత్రి వద్దగల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులరించారు. నాళం బాపిరాజు, మాటూరి నరసింహమూర్తి, శ్రిఖాకొల్లు కామేశ్వరరావు, మాఘం బాల కొండలరావు, పేర్ల రాము, పీరాట్ల శ్రీను, నాళం వెంకట్రామయ్య, సొలస సుబ్బారావు, సలాది వెంకట లింగం, భవానీప్రసాద్‌ పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జి.మ మ్మి, సిబ్బంది, పలువురు వీఆర్వోలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2022-12-16T00:22:19+05:30 IST